70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా ప్రారంభించిన ప్రధాని మోదీ
PM-JAY Ayushman Bharat Yojana : ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.
ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రివర్గం ఆరోగ్య బీమా ప్లాన్ ను ఆమోదించింది. ఇది భారతదేశంలోని 70 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు అదనంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు బీమా కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం లబ్ధి చేకూరుతుంది. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు కూడా రూ.5 లక్షల ప...