Ayodhya : అయోధ్యకు వెళ్తున్నారా? అయితే ఈ రూల్స్ పాటించండి..
Ram Mandir Temple Inauguration : రామజన్మభూమి అయోధ్యలో (Ayodhya) ఈ నెల 22వ తేదీన సోమవారం రామ మందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi) చేతుల మీదుగా బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు ముందు సుమారు 11 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. వేలాది మంది సాధువులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.
మూడు రాష్ట్రాల్లో డ్రై డే
'డ్రై డే' అంటే మద్యపానీయాల విక్రయాలను ఆ రోజు నిలిపివేస్తారు. ఆ రోజున మద్యం దుకాణాలు సహా పబ్బులు, క్లబ్ లు, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వరు. జనవరి 22వ తేదీన జాతీయ పండుగలా జరుపుకుంటామని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adithyanath ) ఇప్పటికే ప్రకటించారు. న్యూయార్క్ లోని ఐకానిక్ టైమ్ స్క్వేర్ నుంచి రా...