Pratishtha Dwadashi 2025 | అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు
Ayodhya Ram Mandir Pratishtha Dwadashi 2025 | అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించిన ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మొదటి వార్షికోత్సవాన్ని జనవరి 11, 2025న 'ప్రతిష్ఠ ద్వాదశి'గా జరుపుకుంటామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం 'ప్రతిష్ఠ ద్వాదశి'కి అందరూ హాజరు కావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ప్రతిష్ఠ ద్వాదశి (Pratishtha Dwadashi)' నాడు కార్యక్రమాల జాబితా ఇదీ..
రామ్ మందిర్ ప్రాంగణంలో, యజ్ఞ మండపం నిర్వహించనున్నారు. ఇందులో శుక్ల యజుర్వేద మంత్రాలతో అగ్నిహోత్రం (ఉదయం 8-11నుంచి మధ్యాహ్నం 2-5), 6 లక్షల రామ మంత్ర పారాయణాలు, రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణాలు ఉంటాయి.
ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో జనవరి 11న రాగసేవ (మధ్యాహ్నం 3-5గం), బధై గాన్ (సాయంత్...