Maha Lakshmi Scheme | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాల్సిందే..
ఆటో కార్మికులు, క్యాబ్ డ్రైౌవర్ల డిమాండ్..
బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సర్వత్రా నిరసన
గిరాకీ లేక రోడ్డున పడుతున్నాం..
అప్పులకు కిస్తీలు కూడా కట్టలేపోతున్నాం..
బస్ భవన్ ముట్టడిలో ఆటో కార్మికుల ఆవేదన
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
హైదరాబాద్: మహాలక్ష్మి పథకం (Maha Lakshmi Scheme) లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో ఆటో డ్రైవర్ల జీవితాలపై పెను ప్రభావం చూపింది.. ఉచితం కావడంతో మహిళలు బస్సు ప్రయాణాల వైపు మొగ్గు చూపడంతో ఆటోలకు పని లేకుండా పోయింది. ఫలితంగా డ్రైవర్లు (Auto drivers) అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇటు ప్రయాణికులు లేక ఆటోల ద్వారా ఆదాయం కోల్పోవడం మరో బతుకు దెరువు లేకపోవడంతో ఆటో డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటివరకు రహదారులపై రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా మంగళవారం హైదరాబాద్ లో బస్ భవన...