EPFO 3.0 : ఇకపై మీ PF డబ్బులను ATM ల నుంచి కూడా డ్రా చేసుకోవచ్చు..
EPF withdrawals: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 'EPFO 3.0' తో ఒక పెద్ద అప్‌గ్రేడ్‌ను తీసుకువస్తోంది. ఇది PF డబ్బులను సులభంగా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.చందాదారులు త్వరలో సాధారణ బ్యాంకు లావాదేవీల మాదిరిగానే ATM ల నుంచి మీరు నేరుగా ప్రావిడెంట్ ఫండ్‌ను డ్రా చేసుకోవచ్చు. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థను నగదు లావాదేవీలను సరళీకృతం చేయడానికి ప్రవేశపెతున్నట్లు పేర్కొన్నారు.
PFO తన చందాదారులకు బ్యాంకింగ్ లాంటి సౌలభ్యాన్ని తీసుకువచ్చే 'EPFO 3.0'ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. "రాబోయే రోజుల్లో, EPFO 3.0 వెర్షన్ వస్తుంది. దీని అర్థం EPFO బ్యాంకులా మారుతుంది. లావాదేవీలు బ్యాంకులో నిర్వహించబడినట్లుగా, మీరు (EPFO చందాదారులు) మీ యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) కలిగి ఉం...