Lok Sabha Elections | బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ
Lok Sabha Elections | న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఢిల్లీ మాజీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ (Arvinder Singh Lovely) ఈరోజు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ (Congress) మాజీ ఎమ్మెల్యేలు రాజ్‌కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బసోయా, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమిత్ మల్లిక్‌లతో పాటు ఢిల్లీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ సమక్షంలో బీజేపీలో చేరారు.
గతంలో ఏప్రిల్ 28న Arvinder Singh Lovely కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తో పొత్తు పెట్టుకోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు, కల్పిత, దురుద్దేశపూరిత అవినీతి ఆరోపణలు చేసిన పార్టీతో మళ్లీ పొత్తు పె...