New pensions | ఇక వారి కూడా పింఛన్.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
New pensions | తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామంలో ఘనంగా సత్కరించిన విషయం విదితమే! ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నజరానా అందించగా, ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛను (Artistes Pension )కు సంబంధించి సోమవారం జీవో విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
సమాజంలో కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందులో భాగంగా ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప తదితరు...