ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారీగా దసరా సెలవులు
AP TS Dasara Holidays తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఏపీలో 11 రోజులు, తెలంగాణ లో 13 రోజులు దసరా హాలిడేస్ అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
AP TS Dasara Holidays : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. తెలంగాణలో ఈ ఏడాది 13 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబరు 26న తిరిగి స్కూళ్ల పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికాలు వెల్లడించారు.. తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈనేపథ్యంలోనే పాఠశాలలు, కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించింది. అక్టోబరులో సాధారణంగా సెలవులు ఎక్కువగా ఉంటాయి.
13 రోజులు సెలవులు
తెలంగాణలో బతుకమ్మ, దసరా ( విజయదశమి) పండుగలకు సెలవులు మొత్తం 13 రోజులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్...