Rain Alert | రాష్ట్రానికి నాలుగు రోజులు వర్షాలు !
Hyderabad Rain Alert | రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. .మరో ఆవర్తనం అండమాన్ సముద్రంలో సముద్ర మట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనంగా బలపడే చాన్స్ ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయు గుండంగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది.
ఇక ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. , సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లా...