Amazon Great Indian Festival sale 2023 : భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో ఈ ఏడాది అతిపెద్ద సేల్స్ ప్రారంభించనున్న అమేజాన్..
వచ్చే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ (Amazon Great Indian Festival sale 2023) తేదీని ముందే ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అక్టోబరు 8న ప్రారంభం కానుంది. అయితే ఈ ఫెస్టివ్ సేల్స్ ముగింపు తేదీని ఇంకా వెల్లడించలేదు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎప్పటిలాగే ఒకరోజు ముందుగా అంటే అక్టోబరు 7 అర్ధరాత్రి నుంచే ముందస్తుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఇ-కామర్స్ దిగ్గజం తన వెబ్‌సైట్‌లో కొన్ని ముందస్తు డీల్స్, డిస్కౌంట్లను కూడా టీజ్ చేసింది. SBI కార్డ్ హోల్డర్లు.. ఉత్పత్తులపై 10 శాతం ఇన్ స్టాండ్ డిస్కౌంట్ పొందగలరు. ఈ సేల్ లో మొబైల్‌లు, యాక్సెసర్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అలాగే, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, మరిన్నింటిపై 75 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నారు.
ఇ-కామర్స్ కంపెనీ వివిధ మొబైల్ ఫోన్‌లు, ఉపకరణాలు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్ల...