Delhi Jama Masjid | ఢిల్లీ జామా మసీదును కూడా సర్వే చేయాలి..
Delhi Jama Masjid : ఉత్తరప్రదేశ్ సంభాల్ (Sambhal)లోని జామా మసీదును హరిహర దేవాలయంగా, రాజస్థాన్‌లోని అజ్మీర్ (Ajmer Sharif Dargah) లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలైహ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ కోర్టులలో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే.. అయితే తాజగా హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదుపై కూడా పిటిషన్ వేశారు. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా స్పందిస్తూ.. జామా మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ భారత పురావస్తు శాఖ (ASI) జనరల్‌కు లేఖ రాశారు.
జామా మసీదు మెట్లపై కృష్ణుడి ఆలయ విగ్రహాల అవశేషాలు ఉన్నాయని హిందూ సేన పేర్కొంది. ఔరంగజేబ్ నామా, సాకీ ముస్తాక్ ఖాన్ ఔరంగజేబుపై రాసిన 'మసీర్-ఎ-ఆలమ్‌గిరి' పుస్తకంలో తమ రుజువు రాసి ఉందని తెలిపింది. హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదును సర్వే చేసి, ఆ విగ్రహాలను బయటకు తీసి ఆలయాల్లో తిరిగి ప్రతిష్ఠించాలని కోరుతోంది. దీంతో ...