Adani Foundation | రాష్ట్ర ప్రభుత్వానికి అదానీ గ్రూప్ 100 కోట్ల విరాళం..
Adani Foundation | హైదరాబాద్: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళాన్ని ప్రకటించారు. అదానీ గ్రూప్‌నకు (Adani Group) చెందిన అదానీ ఫౌండేషన్ ద్వారా ఏకంగా రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ మేరకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి రూ.100 కోట్ల చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లో అందించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
యువతలో నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ (Young India Skills University) కి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని గౌతమ్ అదానీ హామీ ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలు...