తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టిన విజయ్..
Actor Vijay | చెన్నై: వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల మధ్య తమిళ అగ్ర నటుడు.. తన పార్టీ తమిళగ వెట్రి కళగం తొలి మహానాడులో పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టాడు.. ''నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో నేను భయపడడం లేదుసస అంటూ నటుడు విజయ్ (Vijay) వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని అన్నారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతోపాటు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సభకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.
పార్టీ గీతం వినిపిస్తుండగా ప్రత్యేకంగా నిర్మించిన ర్యాంప్‌పై నడిచిన ఆయన 100 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై పార్టీ జెండాను లాంఛనంగా ఎగురవేశారు. గంటల కొద్దీ నిరీక్షణ తరువాత విజయ్ అద్భుతమైన తీరిలో మ...