Thursday, March 6Thank you for visiting

Tag: Accidents

Kavach System | ఇక రైల్వేల్లో యుద్ధప్రాతిప‌దిక‌న క‌వ‌చ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు : అశ్విని వైష్ణవ్

National
Indian Railways | రైలు ప్ర‌మాదాల నివార‌ణ‌కు క‌వాచ్ టెక్నాలజీ ( Kavach System  )ని ఇప్పుడు దేశంలో మిషన్ మోడ్‌లో అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హై టెక్నాలజీ, కఠినమైన భద్రతకు మారుపేరుగా కవాచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థ గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు భార‌తీయ రైల్వేల్లోని అన్ని రూట్ల‌లో ఇప్పుడు వేగంగా ఇన్ స్టాల్ చేయ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ వ్యవస్థ అవసరమైతే ఆటోమెటిక్ గా బ్రేక్‌లను వేయ‌డం ద్వారా అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో రైలు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైలును సురక్షితంగా నడిపేలా చేస్తుంది. ఇటీవ‌ల కాలంలో ప‌లుచోట్ల రైలు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌గా పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ఆస్తులు ధ్వంస‌మ‌య్యాయి ఈ నేప‌థ్యంలోనే క‌వ‌చ్ ఇన్‌స్టాలేషన్ (Kavach System  ) విష‌య‌మై కేంద్రం ...

TGSRTC | రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ బస్సులలో ఇకపై సరికొత్త టెక్నాలజీ..!

Telangana
AI-powered alert ADAS | హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఆధునిక‌ టెక్నాల‌జీ వైపు ముందుకుసాగుతోంది. ప్రమాదాలను నివారించేందుకు అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ఏడీఏఎస్‌) డివైజ్‌ను ఇన్ స్టాల్ చేయాల‌ని నిర్ణ‌యించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ఈ కాన్సెప్ట్‌ను తమ బస్సుల్లో పెద్ద ఎత్తున అమర్చాలని యోచిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 200 రాష్ట్ర రవాణా బస్సుల్లో ఏర్పాటు చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-పవర్డ్ అలర్ట్ సిస్టమ్ గత ఏడాదిలో హైవేలపై ప్రమాదాలను 40 శాతం వరకు తగ్గించడంలో సహాయపడింది. హైవేలపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ముందస్తుగా 2022 సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని మూడు జాతీయ రహదారులైన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-నాగ్‌పూర్‌లో ప్రయాణించే బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. మార్చి 2023, ఏప్రిల్ 2024 మ...
Exit mobile version