Saturday, March 15Thank you for visiting

Tag: 500 gas cylinder

Rs.500 Gas Cylinder | రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మీ ఖాతాలో జమ కావటం లేదా..? అయితే ఇలా చేయండి

Telangana
Rs.500 Gas Cylinder |  తెలంగాణ ప్రభుత్వం ఎన్నిక‌ల హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద‌ రూ.500ల‌కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ప్రజా పాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులకు ప్రస్తుతం ఈ పథకం కింద రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందుతోంది. అయితే సిలిండర్ ఇంటికి తీసుకొస్తే.. వినియోగదారులు పాత ధరనే చెల్లించాలి. మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులైనా స‌రే పాత ధరనే చెల్లించాలి. సబ్సిడీ డ‌బ్బుల‌ను తర్వాత ప్రభుత్వం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి జ‌మ‌ చేస్తుంది. కాగా మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులు కొందరి అకౌంట్లలో వెంటనే డబ్బులు జమ కావటం లేద‌ని అనేక ఫిర్యాదులు వ‌స్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియ‌క‌ ఆందోళనకు గురవుతున్నారు. సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు జమ కాక‌పోతే 1967 లేదా 180042500333 నంబర్‌కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఆ నెంబర్లకు కాల్ చేస్తే...

తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు..500 గ్యాస్ కి ఓకే..

Telangana
తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు, రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన సుప్రసిద్ద గీతం 'జయ జయహే తెలంగాణ' ఎంపిక చేసింది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి( RevanthReddy) అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమై  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీ (TG) గా మార్చాలని తీర్మానించింది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తెలంగాణ (Telangana) తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని,  అందుకే కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.. రాష్ట్ర గీతంగా అందెశ్రీ  జయ జయహే తెలంగాణను ఆమోదించింది. ...
Exit mobile version