
vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..
వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకతలు ఇవే..
vande sadharan: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంది. వీటికి విలాసవంతమైన సెమీ హై స్పీడ్ రైళ్లుగా పేరుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే.. హైస్పీడ్ తో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేరవేస్తుంది. అయితే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ కోచ్ లు లేవు. అందుకే రాత్రి ప్రయాణం ఇందులో వీలు లేదు..
ఈ క్రమంలోనే సాధారణ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తీసుకొస్తోంది భారతీయ రైల్వే. స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే కార్మికులను దృష్టిలో ఉంచుకుని వీటిని తయారుచేశారు.
సాధారణ్ లో సౌకర్యాలు ఏమున్నాయి.?
కాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోలిస్తే.. వందే 'సాధారణ్ '(Vande Sadharan) రైళ్లు కాస్త భిన్నంగా ఉంటాయి. వందే సాధారణ్ రైళ్లు దాదాపుగా 800 కిలోమీటర్ల...