
Rythu Bharosa | అన్నదాతలకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
Rythu Bharosa | రైతు భరోసాపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌలి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో వార్షిక బ్జడెట్ ప్రతిపాదనలపై చర్చలు జరిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా అమలు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్...