Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు
Bharat Atta: పెరుగుతున్న గోధుమల ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు దీపావళి వేళ కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళికి ముందు దేశవ్యాప్తంగా 'భారత్ అట్టా' బ్రాండ్ పేరుతో కిలోకు రూ. 27.50 రాయితీపై గోధుమ పిండిని విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 'భారత్ అట్టా'ని దేశంలోని 800 మొబైల్ వ్యాన్లు, 2,000 కంటే ఎక్కువ అవుట్ లెట్ల ద్వారా సహకార సంస్థలైన నాఫెడ్, ఎన్ సిసిఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా విక్రయించనున్నట్లు వెల్లడించింది. 'భారత్ అట్టా' రాయితీపై అందుబాటులో ఉంటుంది, కాగా గోదుమ పిండి ధర నాణ్యత, ప్రదేశాన్ని బట్టి ప్రస్తుతం మార్కెట్ ధర రూ. 36-70 లోపు ఉంటుంది.
ప్రతిచోటా ఆటా
ధరల స్థిరీకరణ నిధి పథకంలో భాగంగా కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో 18,000 టన్నుల 'భారత్ అట్టా'ని కిలోకు రూ. 29.50 చొప్పున ఈ సహకార సంస్థల ద్వారా ప్రయోగాత్మకంగా విక్రయించింది.
'భారత్ అట్టా' ను కు సంబంధించిన 100 మొబైల్ వ్...