Rajya Sabha Elections 2024 : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు..
Rajya Sabha Elections 2024 Updates: రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇందులో పార్టీ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ఉన్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు
Rajya Sabha Elections 2024 : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది పార్టీ అధిష్టానం ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, హైదరాబాద్ కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది . ఈ మేరకు పార్టీ హై కమాండ్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లను ప్రకటించింది. కాగా రేపటితో నామినేషన్లకు గడువు ముగియనుండడంతో వీరంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.T Congress Rajya Sabha Candidates : అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ తరఫున 2018 అసెంబ్...