Monday, March 3Thank you for visiting

Suresh Gopi కేర‌ళ కమ్యూనిస్టు కంచుకోటలో చ‌రిత్ర సృష్టించిన సురేష్ గోపి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయం..

Spread the love

BJP MP Suresh Gopi | మ‌ల‌యాళ న‌టుడు సురేష్ గోపి (Suresh Gopi) కేరళ రాజకీయాల్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు.ఇటీవల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (Lok Sabha election) ఘన విజ‌యం సాధించి మొట్టమొద‌టి సారిగా కేర‌ళ రాష్ట్రం నుంచి బీజేపీ (BJP) అభ్య‌ర్థిగా పార్ట‌మెంట్‌లో అడుగు పెట్ట‌బోతున్నారు. 2016లో మొదటిసారి రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన సురేష్ గోపి.. ఆ త‌ర్వాత బీజేపీలో చేరి 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మిపాలయ్యారు. ఆ వెంట‌నే 2021లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోను పోటీ చేయగా విజయం వరించలేదు. ముచ్చ‌ట‌గా మూడోసారి త్రిషూర్ నుంచి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నో ఆటుపోట్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని చివ‌ర‌కు ఘన‌ విజయం సాధించారు

మ‌ళ‌యాల సురేష్ గోపి. మలయాళ చిత్ర‌సీమ‌తో పాటు రాజకీయాల్లో ఆయ‌న‌ది సుదీర్ఘమైన క‌ష్ట‌త‌ర‌మైన కథ. తన 39 ఏళ్ల సుదీర్ఘ సినీ జీవితంలో 65 ఏళ్ల గోపి తన అస‌మాన‌ నటన, డైలాగ్ డెలివరీతో ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆయ‌న ఎన్నో క‌ష్టాల‌తో పోరాడవలసి వచ్చింది.

గోపీ కూడా బిజెపితో తన ఎనిమిదేళ్ల రాజకీయ అనుభ‌వం ఉంది. కేరళలో పార్టీలో అనేక‌ వర్గాలను తట్టుకుని త్రిసూర్‌లో సిపిఐకి చెందిన విఎస్ సునీల్ కుమార్ (సమీప ప్రత్యర్థి), కెపై 74,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కేర‌ళ‌లో మొట్ట‌మొద‌టిసారి బీజేపీ నుంచి గెలిసిన ఎంపీగా సురేష్ గోపి రికార్డు సృష్టించారు. బీజేపీ సీనియ‌ర్ నేత‌లు కేంద్ర మంత్రులు వి.మురళీధరన్, రాజీవ్ చంద్రశేఖర్ వరుసగా అట్టింగల్, తిరువనంతపురంలో ఎన్నికల పోటీలో ఓడిపోయారు.

రాజకీయ నాయకుడిగా గోపి తన కృషి, దాతృత్వంతో త్రిస్సూర్‌లోని క్యాథలిక్ కమ్యూనిటీ మద్దతుతో ప్రజల హృదయాల్లోకి ప్రవేశించారు.. “ప్రజలు తను ఆశీర్వాదించినందుకు ధన్యవాదాలు. నేను త్రిసూర్, కేరళ ప్రజల వెంటే ఉంటూ సేవ చేస్తాను” అని సురేష్‌ గోపీ మీడియాతో అన్నారు.

70వ ద‌శకంలో కొల్లాంలో తన విద్యార్థి రోజుల్లో ఫాతిమా మాతా నేషనల్ కాలేజీ నుంచి ఇంగ్లిష్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన గోపి.. కమ్యూనిస్ట్ భావజాలాన్ని అనుసరించేవారు. CPI(M) విద్యార్థి విభాగం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో క్రియాశీల కార్యకర్త గా ప‌నిచేశారు. 90 లో, అతను దివంగత వామపక్ష ముఖ్యమంత్రి ఈకే నాయనార్‌కు అభిమానిగా మారారు. తరువాత, గోపి కాంగ్రెస్‌కు చెందిన దివంగత ముఖ్యమంత్రి కె. కరుణాకరన్, అతని కుటుంబంతో సాన్నిహిత్యం పెంచుకున్నారు.

గత దశాబ్దంలో తన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యం కావ‌డంతో గోపి రాజకీయాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి సూపర్ స్టార్‌లు రాజకీయాలకు ఎలా దూరమయ్యారోని చెబుతూ అతని సన్నిహితులు కొందరు అతన్ని నిరుత్సాహపరిచారు. ఎన్నికల రాజకీయాల్లో విఫలమైన మలయాళ సినిమా ఎవర్ గ్రీన్ నటుడు ప్రేమ్ నజీర్ గురించి వారు గుర్తు చేశారు.
కానీ గోపీ మాత్రం రాజకీయాల్లోకి రావాలనే పట్టుదలను వీడ‌లేదు.

మాజీ రాజ్యసభ ఎంపీ అయిన గోపీ ఎన్నికల రాజకీయాల్లో రెండు సార్లు విఫలయత్నాలు చేశారు. 2019లో, అతను త్రిసూర్ నుంచి BJP అభ్యర్థిగా 293,000 ఓట్లను, 28.3 శాతం ఓట్లను సాధించి, కాంగ్రెస్, CPI అభ్యర్థుల త‌ర్వాత మూడవ స్థానంలో నిలిచారు.. 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఆయ‌న త్రిస్సూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో 31 శాతం కంటే ఎక్కువ ఓట్ షేర్ సాధించినప్పటికీ 5,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూశారు.

నియోజకవర్గంలోని క్రైస్తవుల మద్దతు లేకుంటే త్రిస్సూర్‌లో విజయం తనకు సాధ్యం కాద‌ని గోపీ వ్యూహకర్తలు అప్పుడు గ్రహించారు. ఈ క్ర‌మంలో క్రైస్త‌వ‌ సమాజానికి చేరువ కావడం మొద‌లుపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ త్రిసూర్‌లో పర్యటించడం కూడా గోపీకి గుర్తింపు పెరిగింది. జనవరిలో, గోపి కుమార్తె భాగ్య సురేశ్ వివాహానికి మోదీ హాజరయ్యారు, ఆయనకు బిజెపి టికెట్ వస్తుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.


వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు గోపీని చాలా తక్కువ అంచనా వేశాయి. గత అక్టోబర్‌లో కోజికోడ్‌లోని ఓ హోటల్‌లో తన అనుమతి లేకుండా సురేష్ గోపీ తన భుజంపై చేయి వేశాడంటూ ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు పోలీసులు గోపీపై కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. ఇది వైరల్ కావడంతో పలువురు నటీమణులు గోపీకి మద్దతుగా నిలిచారు. “నేను నా సమాధికి వెళ్ళే వరకు నేను దానిని మరచిపోలేను,” అని గోపీ మీడియాతో అన్నారు.

గోపి ప్రస్తుతం కేరళలో బిజెపికి రేసు గుర్రంగా మారారు. పార్లమెంటు దిగువ సభలో రాష్ట్రం నుంచి పార్టీకి ఉన్న ఏకైక స‌భ్యుడుగా ఉన్నారు. అదే ఆయ‌న భుజస్కంధాలపై భారీ బాధ్యతను మోపింది. బీజేపీ అగ్ర‌నేత‌ల‌ నుంచి పిలుపు అందిన తర్వాత గోపీ దిల్లీకి వెళ్లారు. మోదీ మంత్రివర్గంలో బెర్త్ కోసం పోటీలో ఉన్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఆయ‌న ఈ వార్త‌ల‌ను కొట్టిపారేశారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version