Wednesday, April 16Welcome to Vandebhaarath

Special Stories

Special stories and Exclusive stories

AI cameras | రోడ్ల‌పై ఈ త‌ప్పులు చేసి త‌ప్పించుకోలేరు.. ఈ రాష్ట్రంలో రూ.90కోట్ల వ‌ర‌కు జ‌రిమానాలు..
Special Stories

AI cameras | రోడ్ల‌పై ఈ త‌ప్పులు చేసి త‌ప్పించుకోలేరు.. ఈ రాష్ట్రంలో రూ.90కోట్ల వ‌ర‌కు జ‌రిమానాలు..

రోడ్ల‌పై ఇష్టారాజ్యంగా వాహ‌నాలు న‌డుపుతామంటే కుద‌ర‌దు.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజ‌న్సీతో ప‌నిచేసే ఈ హైటెక్ సీసీ కెమెరాలు (AI cameras) మిమ్మ‌ల్ని ఓ కంట క‌నిపెడుతూనే ఉంటాయి. ఏ చిన్ని త‌ప్పు చేసినా ఇట్టే ప‌సిగ‌ట్టి ఫొటోలు తీసి పోలీసుల‌కు అందిస్తాయి. బెంగళూరు-మైసూరు హైవేపై ( Bengaluru-Mysuru highway ) ఏఐ కెమెరాలు 13 లక్షల ట్రాఫిక్‌ ఉల్లంఘనలను గుర్తించాయి. వీటి సాయంతో పోలీసులు గ‌త మూడేళ్లలో రూ. 90 కోట్ల వ‌ర‌కు జరిమానాలు విధించారు. అయితే ఇందులో కేవ‌లం 4కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగారు. 119 కి.మీ 10-లేన్ బెంగళూరు-మైసూరు హైవే వెంబడి అమర్చిన ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) కెమెరాలు 2022-2024 మధ్యకాలంలో 13 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను బుక్ చేశాయని కర్ణాటక హోం శాఖ వెల్ల‌డించింది. ఈ నివేదిక ప్రకారం ఈ మూడేళ్లలో మొత్తం రూ.90 కోట్ల జరిమానాలు కూడా విధించగా అందులో రూ.4 కోట్లు మాత్రమే వ...
Special Stories

One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?

One Nation One Election : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (ONOE) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు . లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని ప‌లు వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో దేశంలో ప్రతి సంవత్సరం త‌ర‌చూ ఏదో ఒక‌చోట‌ ఎన్నికల‌ను నిర్వ‌హించాల్సివ‌స్తోంది. దీంతో భారీగా వనరులు, సమయం వృథా అవుతోంది . 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఎందుకు? పెద్ద ఎత్తున డ‌బ్బులు ఆదా.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై అధికంగా ఆర్థిక భారం పడుతుంది. ...
Special Stories

Kanchi Kamakoti Peetham | సనాతన ధర్మ ప్రచారం కోసం అందుబాటులోకి శంకర విద్యాలయం

Karnool : కంచి కామకోటి పీఠం (Kanchi Kamakoti Peetham) కొత్త‌గా పొదిలి (Podili) లోని ఒంగోలు సమీపంలో నిర్మించిన‌ సనాతన ధర్మ సేవా గ్రామమైన కంచి కామకోటి శంకర విద్యాలయం (sankara vidyalaya) అందుబాటులోకి వ‌చ్చింది. యువతలో సనాతన ధర్మ విలువలను పెంపొందించడమే ఈ విద్యాల‌యం లక్ష్యం. 31 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ విద్యా కేంద్రంలో ఆధునిక ఇంగ్లీషు-మీడియం విద్యను వేద అధ్యయనాలు, క్రీడలు, కళలలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విలువ-ఆధారిత విద్యను అందించనున్నారు. అనేక సాంప్రదాయ వేద పాఠశాలలు కేవలం మతపరమైన అధ్యయనాలపై దృష్టి సారిస్తుండగా, ఈ సంస్థ వ్యాల్యూ బేస్డ్ లర్నింగ్‌తో ఆధునిక‌ బోధనా పద్ధతులను అనుసరించడం విశేషం. పాఠశాల ప్రస్తుతం 6 & 7 తరగతుల్లో 44 మంది విద్యార్థులకు సేవలను అందిస్తోంది. ఇది కులం లేదా మతంతో సంబంధం లేకుండా విద్య‌ను అందిస్తోంది .ఆధునిక విద్యలో తమను తాము అభివృద్ధి చేసుకుంటూ స్తో...
Special Stories

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా వెళుతుందో తెలుసా..

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలను విప్లవాత్మకంగా మార్చింది, వేగం, సౌకర్యం, భద్రతతో కూడిన ఈ ప్రీమియం రైళ్లు కొద్ది రోజుల్లోనే ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొన్నాయి. ప్రజలు ఆధునిక సౌకర్యాలు, సమయపాలన, వేగం పరంగా భారతీయ రైల్వేలో ఏ రైళ్లు ఉత్త‌మ‌మో దానికే మొగ్గుచూపుతుంటారు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways)  కూడా విభిన్న‌మైన‌ ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా స‌రికొత్త రైళ్ల‌ను త‌ర‌చూ ప్ర‌వేశ‌పెడుతోంది స్టేష‌న్ల‌లో కూడా మౌలిక వ‌స‌తులను క‌ల్పిస్తోంది .ఇది బహుశా భారతీయ రైళ్లకు స్వ‌ర్ణ యుగంగా చెప్ప‌వ‌చ్చు. ఆర్థిక వృద్ధికి, ప్రాంతీయ అభివృద్ధికి ప్రీమియం రైళ్ల‌ విస్తరణతో దేశమంతటా కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vandebhaarath Express) సిరీస్ రైళ్లు.. మిగ‌తా హైస్పీడ్‌ రైళ్ల సర్వీసుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ర...
Special Stories

Maha Kumbh Mela 2025 : మహాకుంభ మేళా – టెంట్ సిటీ ఏమిటి? అందులో ఎలా బుక్ చేసుకోవాలి..?

Maha Kumbh Mela 2025 : మహాకుంభ మేళాలో అత్యాధునిక సౌకర్యాలతో టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు మహా కుంభ్ గ్రామ్, IRCTC టెంట్ సిటీ ప్రయాగ్‌రాజ్‌లోని డీలక్స్ టెంట్లు,  ప్రీమియం టెంట్‌లలో బస చేసే అవకాశం కల్పించింది. అందులో రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ గుడారాలు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫైర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు.  ఇక్కడ ఉండే వారికి భోజనశాలలో బఫే,  క్యాటరింగ్ సేవలతో పాటు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కుంభమేళా పరిసరాల్లో తిరిగేందుకు, స్నానఘట్టాలకు వెళ్లేందుకు షటిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ వాహనాల ద్వారా ఇక్కడకు వెళ్లవచ్చు. ప్రతిరోజూ సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించనున్నారు. మీరు ఇక్కడ యోగా/స్పా/బైకింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు.  Maha Kumbh Mela 2025 :  టెంట్ సిటీని ఎలా ఎక్కడ బుక్ చేయాలి? మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్...
Special Stories

Maha Kumbh Gram Tent City | మ‌హాకుంభ‌మేళాలో సకల సౌకర్యాలతో టెంట్ సిటీ..

Mahakumbh Mela 2025 : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభ మేళాను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో "మహా కుంభ్ గ్రామ్" పేరుతో భారీ ప్రీమియం టెంట్ సిటీ (Maha Kumbh Gram Tent City) ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విలాసవంతమైన సౌక‌ర్యాల‌తో గొప్ప సాంస్కృతిక అనుభూతితో ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని ఐఆర్‌సిటిసి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని గౌరవించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. భ‌క్తులు, ప‌ర్యాట‌కులంద‌రికీ , సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తామ‌ని జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన కంపెనీ ఐఆర్‌సిటీసీ.. ప‌ర్యాట‌కుల కోసం ఆస్తా, భారత్ గౌరవ్ రైళ్లలో ఇప్పటి వరకు 6.5 లక్షల మంది ప్ర‌యాణికుల‌ను విజ...
Special Stories

Hydrogen Train | దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు వస్తోంది.. ఈ రైళ్ల ప్రత్యేకలు ఇవే..

Hydrogen Train : రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే  గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో త్వరలోనే  హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. భారతీయ  రైల్వే శాఖ  డిసెంబర్ 2024లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించనుంది, హైడ్రోజన్ రైళ్ల ప్రత్యేకత ఏంటి? హైడ్రోజన్ రైళ్లకు ఎన్నో ప్రత్యకతలు ఉన్నాయి.  సంప్రదాయ రైళ్ల మాదిరిగా ఇవి నడిచేందుకు డీజిల్ లేదా విద్యుత్ అవసరం  లేదు. ఇందులో శక్తిని ఉత్పత్తి చేయడానికి నీటిని ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటాయి. అలాగే రైలుకి అవసరమైన విద్యుత్‌ను సైతం హైడ్రోజన్ ద్వారా తయారు చేసుకోవటం ఈ రైళ్ల ప్రత్యేకత,  హైడ్రోజన్ రైళ్లతో కాలుష్యమనే మాటే ఉండదు. డీజిల్, ఎలక్ట్రికల్ రైళ్ల కంటే కూడా జీరో పొల్యూషన్ తో నడుస్తాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ హైడ్రోజన్ రైళ్లను అన్నిదేశాలూ తీసుకువొస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ లోనూ హైడ్రోన్ రైలు పట్టాలు ఎక్కబోతున...
National, Special Stories

Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ

Amrit Bharat Station Scheme : దేశంలోని రవాణా మౌలిక సదుపాయాలు పూర్తి మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను ఆధునీకకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్  ను ప్రవేశపెట్టారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వే స్టేషన్‌ల సామర్థ్యాన్ని పెంచే మాస్టర్ ప్లాన్‌తో దీన్ని అమలు చేస్తున్నారు. Telangana Railway Stations Development: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(Amrit Bharat Station Scheme) కింద రైల్వే ప్రయాణీకులకు ఆధునిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 38 రైల్వే స్టేషన్‌లను మొత్తం రూ.1830.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ శాటిలైట్ టెర్మినల్ గా రూపుదిద్దుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లు అంతర్జాతీయ విమానాశ్...
Special Stories

దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే  రైలు ఇదే.. 111 స్టేషన్లలో హాల్టింగ్..   

India's slowest train | భారత్ లో రైళ్లు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి మూలను కలుపుకుంటూ వెళతాయి. పర్వతాలు, ఎడారులు, తీర ప్రాంతాల మీదుగా ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తాయి. అయితే ఇందులో తక్కువ దూరాలకు అలాగే సుదూర ప్రయాణాలకు రైళ్లు ఉన్నాయి. కొన్ని రైళ్లు నాన్‌స్టాప్‌గా, మరికొన్ని దాదాపు ప్రతి స్టేషన్‌లో ఆగుతాయి. ఇక్కడ మనం భారతదేశంలో అత్యధిక స్టాప్‌లు ఉన్న రైలు గురించి తెలుసుకుందాం. ఈ రైలు తన 37 గంటల ప్రయాణంలో 111  స్టేషన్లలో ఆగుతుంది. దీని వలన ప్రయాణికులు తమకు కావలసిన స్టేషన్లలో ఎక్కేందుకు దిగేందుకు వీలు కల్పిస్తుంది. అత్యధిక సంఖ్యలో స్టాప్‌లతో రైలు Train with highest number of stops : దేశంలో అత్యధిక స్టాప్‌లు ఉన్న రైలు హౌరా-అమృత్‌సర్ (Howrah-Amritsar Mail )  మెయిల్. ఇది పశ్చిమ బెంగాల్‌లోని హౌరా , పంజాబ్‌లోని అమృత్‌సర్ మధ్య నడుస్తుంది. హౌరా-అమృత్‌సర్ మెయిల్ 10, 20 లేద...
Special Stories

దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో వెలిసిన అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసా.. ?

Durga Navratri 2024 : 'నవరాత్రి' అంటే అక్షరాలా తొమ్మిది రాత్రులు. ఈ తొమ్మిది రాత్రులు దుర్గామాతను అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు చేస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన తర్వాత దుర్గాదేవి కైలాస పర్వతం నుంచి భూమిపై ఉన్న తన తల్లిగారి ఇంటికి తన ప్రయాణాన్ని ప్రారంభించిందని నమ్ముతారు. ఈ నవరాత్రులలో దుర్గామాత 9 స్వరూపాలను స్మరిస్తూ పూజలు (Durga Puja )  చేస్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు వ‌చ్చాయంటే చాలు భార‌త‌దేశ‌మంతా పండుగ ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. తొమ్మిది రోజ‌లు పాటు అమ్మ‌వారిని ఒక్కో అవ‌తారంలో పూజ‌లు చేసి త‌రిస్తారు. అయితే దుర్గాదేవి వివిధ రూపాలు, పేర్లు, వేడుకలు. పవిత్రమైన నైవేద్యాలు భిన్న‌మైన‌వి. కొంద‌రు భ‌క్తులు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వెల‌సిన అమ్మ‌వారి వివిధ దేవాలయాలను సంద‌ర్శిస్తారు. ఈక్ర‌మంలో తొమ్మిది అవ‌తారాలు గ‌ల అమ్మ‌వారి ఆల‌యాల గురించి ఒక‌సారి తెలుసుకుందాం. . గ‌ చేయబడిన వివిధ ఆల...
Exit mobile version