
Snake viral video : ఈ ప్రకృతిలో శక్తితోపాటు యుక్తిని కలిగి ఉన్న జంతువులే మనుగడ సాగిస్తాయి. తక్కినవి ఆహారమవుతాయి. సరీసృపాల ప్రపంచంలో పాములు విలక్షణమైనవి. వీటిలోని వైవిధ్యమైన జాతులకు చెందిన సర్పాలు వాటి పరిసరాలలో కలిసిపోయి తమ ఎరల కన్నుగప్పి ఆహారాన్ని చేజిక్కించుంటాయి. సర్పాలకు సంబంధించి అద్భుతమైన తెలివిని చూపించే ఇటీవలి వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది.
వైరల్ వీడియోలో ఒక కొండ ప్రాంతంలో ఓ పాము అత్యంత చాకచక్యంగా మెరుపు వేగంతో ఓ పక్షని వేటాడే దృశ్యాన్ని చూపుతుంది. ఇక్కడ ఒక పాము రాళ్ళు, ఆకుల మధ్య దాక్కొని ఓపికగా తన ఆహారం కోసం వేచి ఉంది. పక్షులను ఆకర్షించడానికి దాని పామును తన తోకను ఒక కీటకంలా ఊపింది.. అదే సమయంలో అక్కడికి వచ్చిన పక్షిని అకస్మాత్తుగా, మెరుపు వేగంతో.. ఖచ్చితత్వంతో, పాము పక్షిపైకి దూసుకుపోతుంది. దానిని విజయవంతంగా దాని కోరలతో బంధిస్తుంది. ప్రకృతి శక్తి, పాము అసాధారణమైన వేట పరాక్రమం ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను ఆశ్చర్యపరిచింది.
ఈ Snake viral video చూసి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నెటిజన్ల నుండి అనేక కామెంట్లు చేశారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.