
Sheikh Hasina | రిజర్వేషన్ల కోటా విషయంలో అధికార పార్టీ శ్రేణులకు నిరసన కారులకు మధ్య జరుగుతున్న ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. మరికొన్ని నివేదికల ప్రకారం.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వచ్చినట్టుగా BBC బంగ్లా పేర్కొంది. కాగా, షేక్ హసీనా ఢాకా నుంచి వెళ్లిపోవడం, రాజీనామాపై ఇంకా అధికారిక ధృవీకరించలేదు. ఈ మేరకు ప్రధానమంత్రి సీనియర్ సలహాదారు ఒకరు మీడియాకు సంకేతాలు ఇచ్చారు. తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆమె తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలిపారు.
భారత్‌లో అడుగుపెట్టిన హసీనా!
మరోవైపు ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసాన్ని నిరసనకారులు చుట్టుముట్టడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి వెళ్లిపోయారు. సోమవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ సైనిక హెలికాప్టర్‌లో తన అధికారిక నివాసం ‘బంగా భబన్’ నుంచి బయలుదేరి వెళ్లారు. చెల్లెలు షేక్ రెహానాతో కలిసి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లారని బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు చేరుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా షేక్ హసీనా త్రిపురకు వచ్చిన నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కూచ్‌బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో ఒక్కసారిగా భద్రతను పెంచేశారు.సరిహద్దుల్లో బలగాలను బీఎస్ఎఫ్ అప్రమత్తం అయింది.
షేక్ హసీనా ప్రధానమంత్రి (PM Sheikh Hasina ) పదవికి రాజీనామా చేశారనే కథనాల నేపథ్యంలో దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. దేశంలోని అన్ని పార్టీలతో చర్చించి ఆందోళనలను అదుపులోకి తీసుకొస్తామన్నారు. ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని, దేశంలో శాంతిని పునరుద్ధరించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
ఇదిలా ఉండగా, హసీనా బంగ్లాదేశ్‌కు ఐదుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. మెుదటిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2001 వరకు పూర్తి కాలంలో ఉన్నారు. 2009 నుంచి వరుసగా నాలుగుసార్లు ప్రధానమంత్రి అయ్యారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..