సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత

సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ వీఎం కృష్ణారావు (64) గురువారం కన్నుమూశారు.
కృష్ణారావుకు 47 ఏళ్ల అపారమైన అనుభవంతో జర్నలిజంలో అమూల్యమైన సేవలందించారు. ఈ రంగంలో ఆయన ప్రయాణం 1975లో ఒక స్టింగర్ గా ప్రారంభమైంది. ప్రతిభ, స్వశక్తితో వేగంగా ఉన్నతస్థానాలకు ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో సహా పలు పత్రికల్లో ఆయన తన పనితీరుతో ఆంగ్ల, తెలుగు దినపత్రికలపై చెరగని ముద్ర వేశారు. డెక్కన్ క్రానికల్ లో న్యూస్ బ్యూరో చీఫ్ గా 18 సంవత్సరాలకు పైగా పని చేశారు. ఆత్మీయులందరూ “బాబాయి” అని ముద్దుగా పిలుచుకునే కృష్ణారావు.. చురుకైన ఆలోచనలు ఆయనకు పాత్రికేయ వర్గాల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. కాగా విషాదకరంగా, గత ఏడాది క్యాన్సర్ బారినపడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆయన గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు మనుమలు ఉన్నారు.

READ MORE  Manabadi TS SSC Results 2024 : పదో తరగతి ఫలితాలు విడుదల.. నిర్మల్ జిల్లా ఫస్ట్.. జూన్ 3 నుం సప్లిమెంటరీ పరీక్షలు

సీఎం కేసీఆర్ సంతాపం

సీహెచ్ ఎంవీ కృష్ణారావు (MV Krishna rao) మరణం పట్ల సీఎం కేసీఆర్ (CM KCR) సంతాపం తెలిపారు. అభ్యుదయభావాలు కలిగిన కృష్ణా రావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజాశ్రేయస్సు కోణంలో కృష్ణా రావు చేసిన రచనలు, విశ్లేషణలు, టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని తెలిపారు. 4 దశాబ్దాలకు పైగా జర్నలిజం రంగానికి ఎంతో నిజాయితీగా సేవలు అందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

READ MORE  తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *