Saturday, April 19Welcome to Vandebhaarath

SCR Cancels Trains | ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లు రైళ్లు ర‌ద్దు..

Spread the love

SCR cancels trains | హైదరాబాద్: ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లుచోట్ల రైల్వేట్రాక్స్ కొట్టుకుపోయాయి. దీంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఈ క్ర‌మంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సెప్టెంబర్ 3వ తేదీన‌ నడిచే వివిధ రైళ్లను రద్దు చేసింది.

ఈమేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో.. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (17233); సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (17234); సికింద్రాబాద్ – షాలిమార్ (12774); షాలిమార్ – సికింద్రాబాద్ (12773); సికింద్రాబాద్ – విశాఖపట్నం (22204); విశాఖపట్నం – సికింద్రాబాద్ (12805); సికింద్రాబాద్ – విశాఖపట్నం (20707); విశాఖపట్నం – సికింద్రాబాద్ (20708) మరియు సికింద్రాబాద్ – విశాఖపట్నం (20834) రైళ్ల ను ర‌ద్దు చేశారు.
షెడ్యూల్‌లో ఈ మార్పుల‌ను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాల‌ను ప్లాన్ చేసుకోవాలని SCR అధికారులు ప్ర‌యాణికుల‌ను అభ్యర్థించారు.

తిరువనంతపురం వైపు..

SCR cancels trains  : విజయవాడ-కాజీపేట సెక్షన్‌లోని రాయనపాడు స్టేషన్‌లో భారీ వర్షం, వ‌ర‌ద‌ల కార‌ణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) తిరువనంతపురం డివిజన్ వైపు నడిచే ప‌లు రైళ్ల ను రద్దు చేసింది .
రైలు నెం.22648 కొచ్చువేలి – కోర్బా ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 2, 2024న 06.15 గంటలకు బయలుదేరాల్సి ఉంది. రైలు నెం.22815 బిలాస్‌పూర్ – ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.

అలాగే, కాజీపేట – డోర్నకల్ (07753); డోర్నకల్ – విజయవాడ (07755) ; విజయవాడ – గుంటూరు (07464) ; గుంటూరు – విజయవాడ (07465) ; సెప్టెంబరు 2, 3 తేదీల్లో నడిచే విజయవాడ-డోర్నకల్ (07756), డోర్నకల్-కాజీపేట (07754) రైళ్లను రద్దు చేశారు. SCR అధికారులు రైలు వినియోగదారులు రైలు షెడ్యూల్‌లో మార్పును గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అభ్యర్థించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version