Thursday, March 6Thank you for visiting

Sambhal : సంభాల్‌లో హింసకు ఉపయోగించిన ఇటుకలు, రాళ్లతోనే పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం

Spread the love

Uttar Pradesh Sambhal Violence : సంభాల్ లో హింసాకాండ జ‌రిగిన‌ ప్రాంతంలో శాంతిభద్రతలను ప‌టిష్టం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొత్తం 38 పోలీసు అవుట్‌పోస్టు (Police Outpost)లను నిర్మిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ 24న జరిగిన హింసాత్మక ఘర్షణల సమయంలో అల్లరి మూక‌లు విసిరిన ఇటుకలు, రాళ్లనే ఇప్పుడు ఈ ప్రాంతంలో పోలీసు అవుట్‌పోస్టును నిర్మించడానికి ఉప‌యోగిస్తున్నారు.

గత సంవత్సరం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) జామా మసీదు సర్వే సందర్భంగా దుండగులు భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేయడంతో జిల్లాలో తీవ్ర హింస జరిగిన విష‌యం తెలిసిందే.. ఈ అల్లర్లు ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి.

అయితే పోలీసుల‌పై అల్ల‌రి మూక‌లు విసిరిన‌ రాళ్లను ఇప్పుడు పోలీసు అవుట్‌పోస్ట్ కోసం ఉపయోగిస్తున్నారు.
ఇటుకలు, రాళ్లను ఇప్పుడు దీపా సారాయ్, అలాగే హిందూ పురఖేడ పోలీస్ అవుట్‌పోస్టుల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. సంభాల్ అంతటా మొత్తం 38 పోలీస్ ఔట్‌పోస్టుల‌ నిర్మాణాన్ని జిల్లా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కాగా సంభాల్‌లో జరిగిన హింస స‌మ‌యంలో జ‌రిగిన‌ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఘర్షణల్లో పాల్గొన్న వారిలో చాలా మంది కొత్త పోలీస్ అవుట్‌పోస్టు నిర్మిస్తున్న దీపా సారాయ్ ప్రాంతానికి చెందినవారు. మ‌రో విష‌య‌మేంటంటే నిర్మాణ స్థలం సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా-ఉర్-రెహమాన్ బార్క్ నివాసానికి చాలా దగ్గరగా ఉంది.

మొదటి ఇటుక అందించిన చిన్నారి

దీపా సారాయ్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో మొదటి ఇటుకను ఓ చిన్నారి అందించింది దీని ప్రాముఖ్యతను ASP శ్రీష్ చంద్ర వివరిస్తూ, “మహిళలు, పిల్లల భద్రత వారి రక్షణ గురించి మేము బలమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నాము. మొదటి ఇటుకను వేయడానికి ఒక చిన్నారిని ఎంచుకోవడం వ‌ల్ల వారికి భద్రతపై నమ్మకాన్ని క‌లిగిస్తుంది.” అని అన్నారు. తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ స‌ద‌రు బాలిక‌ ఇలా చెప్పింది, “నేను నఖాసాలో నివసిస్తున్నాను.. కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్ కోసం మొదటి ఇటుకను ఉంచాను. ఇది నిజంగా చాలా బాగుంది. అని పేర్కొంది.

Sambhal మసీదు వివాదం: తదుపరి విచారణ ఏప్రిల్ 28న

Sambhal mosque row : సంభాల్ న‌గ‌రంలోని షాహి జామా మసీదు మొదట హరిహర్ దేవాలయమ‌ని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను జిల్లా కోర్టు ఏప్రిల్ 28ని విచారించాల‌ని నిర్ణయించింది. ఈ కేసు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఆదిత్య సింగ్ ముందుకు వచ్చినప్పుడు, ఈ కేసును ఏప్రిల్ 28కి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌ను మొదట నవంబర్ 19, 2023న మరొక కోర్టులో దాఖలు చేశారు. హిందూ పక్షం తరపున వాదించే న్యాయవాది.. ప్రతివాది తన రాతపూర్వక ప్రకటనను సమర్పించాల్సి ఉందని, కానీ దానిని సమర్పించలేదని చెప్పారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version