Saturday, April 19Welcome to Vandebhaarath

Rythu Runa-Mafi Guidelines | రైతులకు శుభ‌వార్త‌.. రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. రేషన్‌ ‌కార్డు ఆధారంగా..

Spread the love

Rythu Runa-Mafi Guidelines | హైదరాబాద్: కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ (Loan Waiver) చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

  • భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తింపు. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తించ‌నున్నారు.
  • రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది..
  • 12 డిసెంబర్ 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09 డిసెంబర్ 2023 నాటికి బకాయి ఉన్న పంట రుణాలను మాఫీ చేయ‌నున్నారు.
  • 2023 డిసెంబర్ 09 నాటికి బకాయి వున్న అసలు, వడ్డీ మొత్తం పథకానికి అర్హత ఉంటుంది.
  • ఈ పథకానికి రేషన్ కార్డు ప్రామాణికంగా నిర్ణ‌యించారు.
  • వ్యవసాయ శాఖ కమిషనర్, సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా వ్య‌వ‌హరిస్తారు.
  • వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎన్ఐసీ క‌లిసి ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తారు. ఈ ఐటీ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోక్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించేందుకు సౌకర్యం ఉంటుంది. ఈ ఐటీ పోర్టల్‌లో ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌కి బిల్లులు సమర్పించటం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే కంప్లయింట్స్ పరిష్కారానికి మాడ్యూల్స్ ఉంటాయి.
  • ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక బ్యాంక్ నోడల్ అధికారిగా నియమించాలి. ఈ బ్యాంక్ నోడల్ అధికారి బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎన్ఐసీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంకు నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకులోని పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలి.
  • ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుంచి రిఫరెన్స్-1 మెమో జత చేసినట్టి ప్రొఫార్మా -1 లో డిజిటల్ సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్‌లో లేవు. కాబట్టి, పీఎసీఎస్‌కు అనుబంధమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్, రిఫరెన్స్ -2 వ మెమో జత చేసిన
  • ప్రొఫార్మ-2 లో డేటాను డిజిటల్‌గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
  • ప్రతీ బ్యాంకు సీబీఎస్ నుంచి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడం. అవసరమైతే వ్యవసాయశాఖ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి.
  • ఈ పథకం కింద లబ్ధిదారులు, రైతుకు టుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్‌ను పాస్ బుక్ డేటా బేస్‌లో ఉన్న ఆధార్‌తో, పీడీఎస్ డేటా బేస్‌లో ఉన్న ఆధార్‌తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణ మొత్తం నుంచి రుణమాఫీ రూ.2 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది.
  • అర్హతగల రుణ మాఫీ మొత్తాన్ని డీబీటీ విధానంలో నేరుగా లబ్ధిదారులు రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. పీఎసీఎస్ విషయంలో రుణ మాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచ్‌కు విడుదల చేయడం అవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పీఎసీఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు.
  • ఏ కుటుంబానికైతే రెండు లక్షల రూపాయ‌ల‌కు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ. 2లక్షలకు పై బడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత.. అర్హత గల రూ.2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ స‌భ్యుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్నత‌రుణంలో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్దతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.
  • ఈ రుణమాఫీ ఎస్‌హెచ్ఐలు, జెఎల్ టీలు, ఆర్ఎంజీలు, ఎస్ఇసీఎస్‌కు తీసుకున్న అప్పుల‌కు వర్తించదు. ఈ రుణ మాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీ షెడ్యూలు చేసిన రుణాలకు కూడా వర్తించదు. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంటరుణాలకు వర్తించదు. కానీ పీఏసీఎస్ ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది.
  • కేంద్రం అమలు చేసే పీఎం-కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివ‌రాల లభ్యంగా ఉన్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోనికి తీసుకోబడుతుంది.

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version