Friday, March 14Thank you for visiting

భక్తులకు శుభవార్త.. కార్తీకమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీస్ లు

Spread the love

RTC Karthika Masam Special Buses : పవిత్ర కార్తీక‌ మాసంలో రాష్ట్రంలోని ప్ర‌సిద్ధ‌ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD Sajjanar ) వివ‌రాల‌ను వెల్లడించారు. వేముల‌వాడ, శ్రీశైలం, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక‌ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని స‌జ్జ‌నార్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి ఉన్నతాధికారులతో ఈరోజు ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వహించారు.

కార్తీకమాసంలో స్పెషల్‌ బస్‌లు :

టీజీఎస్‌ ఆర్టీసీకి కార్తీక‌ మాసం, శ‌బ‌రిమ‌ల యాత్ర‌ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న‌ అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఆది, సోమ‌వారాలు శైవ‌క్షేత్రాల‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అందుకు త‌గిన‌ట్లుగా స్పెష‌ల్‌ బ‌స్సుల‌ (Special Buses )ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సంద‌ర్భంగా త‌మిళ‌నాడులోని అరుణాచ‌లానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్న‌ట్లు తెలిపారు.

పంచారామాలకు ప్రత్యేక బస్సులు : ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌సిద్ధ‌ పంచారామాల‌కు ప్రతీ సోమ‌వారం ప్రత్యేక బ‌స్సుల‌ను నడిపించ‌నున్న‌ట్లు సజ్జనార్‌ వివ‌రించారు. ఈ ప్రత్యేక బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. పూర్తి వివ‌రాల‌కు ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాల‌ని కోరారు .

అద్దెకు ఇచ్చే బస్సు ఛార్జీల తగ్గింపు

అద్దె ప్రాతిపదిక‌న తీసుకునే ఆర్టీసీ బ‌స్సు చార్జీలను త‌గ్గించిన‌ట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జన‌ర్ పేర్కొన్నారు. ప‌ల్లె వెలుగు బస్సుకు కిలోమీట‌ర్‌కు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డీల‌క్స్ రూ.8, సూప‌ర్ ల‌గ్జరీకి 6 రూపాయలు, రూ.7 వరకు త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు. శ‌బ‌రిమ‌ల‌కు, శుభ‌ముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బ‌స్సుల‌ను బుకింగ్ చేసుకుని సుర‌క్షితంగా గ‌మ్యస్థానాల‌కు చేరుకోవాల‌ని సజ్జనార్ కోరారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version