
Rail Network : రైల్వే ట్రాక్ విస్తరణలో భారతీయ రైల్వే దూసుకుపోతోంది. ఇదే విషయమై న్యూఢిల్లీలో జరిగిన అసోచామ్ (ASSOCHAM) జాతీయ సదస్సులో రైల్వే మంత్రిత్వ శాఖ వాణిజ్య విభాగం అదనపు సభ్యుడు ముకుల్ శరణ్ మాథుర్ మాట్లాడారు. రైలు విద్యుదీకరణ (Track Electrification)లో భారతదేశం ముందంజలో ఉంది. భారతదేశ రైలు నెట్‌వర్క్ ఇప్పుడు 68,000 కి.మీ విస్తరించి ఉందని, మరింత విస్తరణకు సిద్ధంగా ఉందని మాథుర్ ఉద్ఘాటించారు. రైల్వే వ్యవస్థ ప్రతిరోజూ రెండు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తోందని, వలస కార్మికులకు సహాయంగా ఇటీవల 5,000 ప్రత్యేక రైళ్లను నడిపిందని ఆయన గుర్తుచేశారు. భారతదేశ రైలు ఆధునికీకరించే యత్నాల్లో భాగంగా వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టామని ప్రస్తుతం అవి విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.
టికెట్ వాపస్
2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వే విస్తరణ కోసం భారత ప్రభుత్వం రూ.85,000 కోట్లు కేటాయించింది . ప్రయాణికుల సౌకర్యార్థం ఇటీవలే టికెట్ వాపసు ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఇప్పుడు ఒకటి లేదా రెండు పనిల్లోనే డబ్బు వాపస్ తీసుకోవచ్చు.
Rail Network అసోచామ్ నుంచి దీపక్ శర్మ రైల్వేలను ఆధునీకరించడం అనేది భారతదేశం వికసిత్ భారత్’ ప్రధాన లక్ష్యం అని ముకుల్ శరణ్ మాథుర్ స్పష్టం చేశారు. రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడంతోపాటు దేశ. ఆర్థిక వృద్ధికి దోహదం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గోల్డ్‌రాట్ రీసెర్చ్ ల్యాబ్స్‌కు చెందిన అనిమేష్ గుప్తా 40 శాతం రైలు సరుకు రవాణా వాటా, రైల్వే కార్యకలాపాల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ACTO మనీష్ పూరి, ABB ఇండియా లిమిటెడ్ నుండి మూనిష్ ఘుగే పెరుగుతున్న వాణిజ్య డిమాండ్లను తీర్చడానికి ప్రయాణీకుల భద్రతను పెంచేందుకు ఆధునిక భద్రతా చర్యలు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..