
Wayanad : వామపక్షాలు ఎంత వ్యతిరేకించినా రాహుల్ గాంధీ రెండోసారి వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్‌లు భారత కూటమిలో భాగమే, అయినా కూడా ఈ రెండు పార్టీలు కేరళ రాష్ట్రంలో పరస్పరం పోటీ పడుతున్నాయి. అయితే కీలకమైన లోక్‌సభ పోటీకి ముందు కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ తగిలింది. వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) ప్రధాన కార్యదర్శి పిఎం సుధాకరన్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. కాషాయ పార్టీలో చేరిన తర్వాత సుధాకరన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎంపీ, వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ.. ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారని అన్నారు. ” అయనకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. మరొమారు గెలిపిస్కతే వాయనాడ్ అభివృద్ధి అవకాశాలను నాశనం చేస్తారనిసుధాకరన్ విమర్శించారు.
ఇదిలా ఉండగా, 2019లో అమేథీ నుంచి ఓడిపోయినట్లే, ఈసారి వాయనాడ్ పార్లమెంట్ సీటు (Wayanad Lok Sabha Seat )ను కాంగ్రెస్ కోల్పోతుందని ప్రధాని నరేంద్ర మోదీ గత శనివారం రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. అతను ఏప్రిల్ 26 న ఓటింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ తర్వాత అతను, అతని గ్యాంగ్ సురక్షితమైన సీటు కోసం చూస్తారు. ఎందుకంటే అమేథీ తర్వాత, అతను వయనాడ్‌ను కూడా వదిలి వెళ్లాల్సి ఉంటుంది” అని మోదీ విమర్శించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..