Wednesday, April 16Welcome to Vandebhaarath

Pushpa 2 Stampede Case తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ కు రెండు కోట్ల సాయం

Spread the love

Pushpa 2 Stampede Case : పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో బుధ‌వారం కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈఘ‌ట‌న‌లో చిన్నారి శ్రీతేజ్ (Sritej)ఆరోగ్యం నెమ్మ‌దిగా కుదుట‌ప‌డుతుండ‌డంతో కుటుంబ సభ్యులతోపాటు అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారికి స్పృహ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తండ్రి అల్లు అరవింద్ కలిశారు.

‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారిని కలిసిన అనంతరం చిత్రనిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. ‘డాక్టర్లతో మాట్లాడిన తర్వాత బాలుడు కోలుకుంటున్నాడని తెలిసి చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. .

2 కోట్ల సాయం

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ శ్రీతేజ్‌తోపాటు అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి, మేము 2 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇందులో కోటి రూపాయలు అల్లు అర్జున్ అందించగా, నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు 50 లక్షలు ఇచ్చారు. ఈ మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు అందజేస్తామ‌ని తెలిపారు.

రేపు సీఎంను కలుస్తాం..

కాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ దిల్ రాజు (Dil raju)మాట్లాడుతూ.. శ్రీతేజ్ ఆరోగ్య‌ పరిస్థితి మెరుగుపడింది. అల్లు అర్జున్, పుష్ప నిర్మాతలు, సుకుమార్ ఇచ్చిన రూ.2 కోట్లను చిన్నారి, కుటుంబ ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలవాలని సినీ పరిశ్రమకు చెందిన వారు ప్లాన్ చేస్తున్నారు. నిర్మాతలు, నటీనటులు సీఎంను స్వయంగా కలిసే అవకాశం ఉంది. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే బాధ్యతను తనకు సీఎం అప్పగించారని దిల్ రాజు ఉద్ఘాటించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version