
Hanuman temple | హైదరాబాద్ లోని ఓ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం మాంసం ముక్కలను గుర్తుతెలియని వ్యక్తులు పడేయడం కలకలం రేపింది. భక్తులు వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న టప్పాచబుత్ర పోలీసులు అప్రమత్తమయ్యారు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి.
బుధవారం తెల్లవారుజామున టప్పాచబుత్రలోని హనుమాన్ ఆలయం వద్ద కొంతమంది వ్యక్తులు మాంసం ముక్కలను విసిరిన తర్వాత నగరంలోని ప్రశాంత వాతావరణం చెదిరిపోయింది . హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మాంసం ముక్కలను కనుగొని వెంటనే కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. టప్పాచబుత్ర (Tappachabutra) పోలీసులు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి.
విషయం తెలియగానే, పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయం వద్ద గుమిగూడి, ఈ సంఘటనను ఖండిస్తూ నిరసన ప్రారంభించారు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్కడ అల్లర్లు జరగకుండా ఆలయ సమీపంలోని దుకాణాలు మూసివేయించారు.
ఇదిలా ఉండగా ఈఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే పోలీసులు విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆలయం వద్ద నిరసన చేపట్టారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.