Saturday, March 15Thank you for visiting

Republic Day 2025 : గణతంత్ర వేడుకల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ప్రళయ్ క్షీపణి

Spread the love

Republic Day 2025 : భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకోనుండగా, న్యూఢిల్లీలో ని కర్తవ్య మార్గ్ లోజరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల్లో దేశీయంగా తయారైన ప్రళయ్ క్షిపణి (Pralay missile) ని తొలిసారిగా ప్రదర్శించనుంది.

ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన చిన్న క్షిపణి.. శత్రు భూభాగంలోకి వెళ్లి లోతుగా దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ క్షిపణి భారతదేశం స్వదేశీ రక్షణ సాంకేతికతను మరో స్థాయికి పెంచింది. బ్రహ్మోస్ క్షిపణులు, టి-90 ట్యాంకులు ఇతర కీలకమైన ఆయుధాలను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇక్కడ విలేకరులతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే రోజున తొలిసారిగా ప్రళయ్ క్షిపణిని ప్రదర్శించనున్నామని తెలిపారు.

Pralay missile ప్రత్యేకతలు ఇవే..

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన ప్రళయ్ 500-1000-కిలోల పేలోడ్ సామర్థ్యంతో 500-కిమీ పరిధిని కలిగి ఉంది. ఇది యుద్దభూమిలో ఉపరితలం నుండి ఉపరితలంపైకి వినియోగించేందుకు రూపొందించిన క్షిపణి వ్యవస్థ, ఇది దేశ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలలో కీలకమైన పురోగతిని సూచిస్తుంది.

ప్రళయ్ క్షిపణి వ్యవస్థను పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ వెంబడి అలాగే చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంట మోహరించేలా రూపొందించారు. సైనిక పరిభాషలో ప్రలేయ్ స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి (SRBM)గా వర్గీకరించబడింది.

Republic Day parade : ప్రళయ్, బ్రహ్మోస్, పినాక ఇంకా మరెన్నో..

గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ప్రళయ్‌తో పాటు బ్రహ్మోస్ క్షిపణి, పినాక, టి-90 ట్యాంకులు, నాగ్ క్షిపణులు, ఆకాష్, ఐసివి బిఎమ్‌పి-II (శరత్), క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్స్ (నందిఘోష్), యుద్దభూమి నిఘా వ్యవస్థలు (సంజయ్) సహా రక్షణ పరికరాలు, ఆయుధాలను ప్రదర్శించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఇండోనేషియా నుండి ఒక సాంస్కృతిక బృందం కూడా ఇందులో పాల్గొంటుంది.

న్యూ ఢిల్లీలోని కర్తవ్య పాత్‌లో ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌ను చూసేందుకు ఆహ్వానించబడిన ఈశాన్య రాష్ట్రాల నుంచి ముప్పై ఐదు మంది అతిథులు హాజరుకానున్నారు. ఈ 35 మందిలో మహిళా పారిశ్రామికవేత్తలు, జాతీయ అవార్డు గ్రహీతలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, పర్యావరణ పరిరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, లింగ సాధికారత కోసం పనిచేస్తున్న స్వయం సహాయక బృందం సభ్యులు ఉన్నారు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మెట్రో సోమవారం సీఐఎస్‌ఎఫ్ భద్రతా తనిఖీలను ముమ్మరం చేసింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version