వీడియో: పగిలిపోయిన మద్యం బారెల్.. వీధుల్లో నదిలా ప్రవహించిన రెడ్ వైన్
పోర్చుగీస్ లోని ఓ చిన్న పట్టణం సావో లోరెంకో డి బైరోలోని వైన్ తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. దీంతో భారీగా రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించింది.
600,000 గ్యాలన్ల మద్యాన్ని నిల్వచేసిన బారెల్స్ ఊహించని విధంగా కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. నదీ మాదిరిగా రెడ్ వైన్ వీధుల్లో ప్రవహించిన దృశ్యాలను కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీడియోలో సోవో లోరెంకో డి బైరో అనే చిన్న పట్టణంలోని ఓ వీధిలో ఎర్రటి ద్రవం ప్రవహిస్తున్నట్లు చూపించాయి. లీకేజీ అయిన వైన్ ఒలింపిక్-స్విమ్మింగ్ పూల్‌లో నిండి ఉండవచ్చు
వైన్ వీధులమీదుగా ప్రవహించడంతో అధికారులు వైన్‌ని ఆపడానికి ప్రయత్నించారు. అనాడియా ఫైర్ డిపార్ట్‌మెంట్ వరదను ఆపివేసి సెర్టిమా నదిలో కలవకుండా దూరంగా మళ్లించింది. అక్కడి నుంచి వైన్ ప్రవాహం సమీపంలోని పొలంలోకి వెళ్లిందని స్థానిక మీడియాను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
⚡️Red wine has “flooded” the streets in the Portuguese municipality of Anadia after two tanks exploded at a local winery, radio station Rádio Renascença reported. pic.twitter.com/VHLcadfLlp
— War Monitor (@WarMonitors) September 11, 2023
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి.
తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.