
PM Vishwakarma Yojana : దేశంలోని పేదల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. భారతదేశంలోని జనాభాలో ఎక్కువ భాగం చేతివృత్తుల వారు ఉన్నారు. ఇందులో కళాకారులు కూడా ఉన్నారు. చేతివృత్తుల వారికి ఉపాధి, సంక్షేమం కోసం భారత ప్రభుత్వం పిఎం విశ్వకర్మ పథకం అమలు చేస్తోంది.
2023 సంవత్సరంలో, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన (Vishwakarma Scheme)ను ప్రారంభించింది. దీని కింద నైపుణ్య శిక్షణతో పాటు హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను కూడా అందిస్తుంది. ఈ స్కీమ్‌లో ఎవరికి ప్రయోజనాలు లభిస్తాయి.. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శిక్షణలో ప్రతిరోజూ రూ.500
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమం కింద హస్తకళాకారులకు ప్రభుత్వం ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ 15 రోజుల పాటు ఉంటుంది. ఈ శిక్షణ సమయంలో వారికి ప్రతిరోజు రూ.500 స్టైఫండ్ కూడా అందిస్తారు. ఇది కాకుండా, శిక్షణ
పూర్తయిన తర్వాత, టూల్ కిట్‌ను కొనుగోలు చేయడానికి ఒకేసారి రూ.15,000 అందిస్తారు. ఇది కాకుండా ఈ పథకం కింద ముందుగా రూ.లక్ష రుణం కూడా ఇస్తారు. లబ్ధిదారుడు ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తే ఆ తర్వాత లబ్ధిదారుడిక మరో రూ.2 లక్షల అప్పు ఇస్తారు.
పీఎం విశ్వకర్మ పథకానికి ఎలాంటివారు అర్హులు
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పతకం కింది కులవృత్తుల వారికి వర్తిస్తుంది.
- దండలు తయారు చేసే వారు.
- వడ్రంగి (కార్పెంటర్)
- బోట్ మేకర్ (పడవలు తయారీ చేసేవారు
- ఆర్మర్ మేకర్
- బార్బర్ (నాయి బ్రాహ్మణులు)
- కమ్మరి
- హామర్, టూల్ కిట్ మేకర్
- తాళాలు తయారు చేసేవారు
- గోల్డ్ స్మిత్(స్వర్ణకారులు
- కుమ్మరి
- ఫిషింగ్ నెట్ మేకర్ (చేపల వలలు తయారీ చేసేవారు
- శిల్పులు /స్టోన్ కార్వర్/స్టోన్ బ్రేకర్
- చెప్పులు కుట్టేవారు/బూట్ల తయారీదారులు/పాదరక్షల కళాకారులు
- మేసన్ (తాపీ మేస్త్రీలు)
- మేదరి – బాస్కెట్ మేకర్/బాస్కెట్ వీవర్/మాట్ మేకర్/కొయిర్ వీవర్/చీపురు
- బొమ్మల తయారీదారులు (టాయ్ మేకర్ )
- గార్లాండ్ మేకర్
- చాకలివారు
- దర్జీ(టైలర్)
PM Vishwakarma : ఎలా దరఖాస్తు చేసుకోవాలి
Pradhan Mantri Vishwakarma Yojana Apply : మీరు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద ప్రయోజనాలను పొందాలనుకుంటే. మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు PM విశ్వ కర్మ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmvishwakarma.gov.in సందర్శించాలి
అక్కడ మీరు విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ పేజీకి చేరుకున్న తర్వాత, మీరు కొన్ని ముఖ్యమైన వివరాలను నమోదు చేయాలి.
దీని తర్వాత మీరు ఫారమ్‌ను సమర్పించాలి.
లేదా మీరు సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.,
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..