Wednesday, March 5Thank you for visiting

PM Modi Cabinet Meeting | ప్రధాని మోదీ తొలి సంతకం ఈ ఫైల్ పైనే.. రైతులకు నిరుపేద‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌..

Spread the love

PM Modi Cabinet Meeting | కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర‌ మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు న‌మోదు చేశారు. ఆయ‌న‌తోపాటు 72 మందితో కేంద్ర మంత్రులు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ టీమ్ లో 30 మందికి క్యాబినెట్‌ మంత్రులుగా చాన్స్‌ లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గం లో అవ‌కాశం కల్పించారు. అయితే మోదీ 3.0 కేబినెట్ తొలిసారి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో సమావేశం కానుంది.

ఈ కీల‌క స‌మావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (Pradhan Mantri Awaas Yojana-Gramin) కింద 2 కోట్ల అదనపు గృహాలను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉన్నట్లు స‌మాచారం. అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని కూడా సుమారు 50 శాతం పెంచే చాన్స్‌ ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్ర‌ధాని మోదీ తొలి సంతం ఈ ఫైల్ పైనే..

PM Modi Cabinet Meeting : ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం దిల్లీలోని సౌత్ బ్లాక్ కార్యాలయంలో వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘పీఎం కిసాన్‌ నిధి (PM Kisan Nidhi ) ప‌థ‌కం కింద నిధుల‌ విడుదలకు సంబంధించిన తొలి ఫైల్‌పై సంతకం చేశారు. 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు సుమారు ₹ 20,000 కోట్లను పంపిణీ చేసే పీఎం కిసాన్ నిధి 17వ విడత విడుదల కోసం ఫైల్‌పై ఆయన సంత‌కం చేశారు.
ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘ త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంద‌ని, కాబట్టి, బాధ్యతలు స్వీకరించినప్పుడు రైతు సంక్షేమానికి సంబంధించిన ఫైలు పైనే తొలిసంత‌కం చేసిన‌ట్లు చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేయాలని భావిస్తున్న‌ట్లు తెలిపారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version