
PM-JAY Ayushman Bharat Yojana : ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.
ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రివర్గం ఆరోగ్య బీమా ప్లాన్ ను ఆమోదించింది. ఇది భారతదేశంలోని 70 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు అదనంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు బీమా కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం లబ్ధి చేకూరుతుంది. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు కూడా రూ.5 లక్షల ప్రయోజనం అందుతుంది. పథకం కింద హెల్త్ కార్డు కోసం పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్‌లో నమోదైన వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే AB PM-JAY కింద బీమా పొందిన కుటుంబాలకు చెందిన 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లు తమ కోసం సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు అదనపు టాప్-అప్ కవర్ పొందుతారు. ఈ సీనియర్ సిటిజన్లు 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుటుంబంలోని ఇతర సభ్యులతో కవరేజీని పంచుకోవాల్సిన అవసరం లేదు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఆందోళన చెందే వృద్ధులు ఇప్పుడు ధైర్యంగా (గౌరవంగా జీవించగలుగుతారు” అని మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలు అమలు చేయపోవడం విచారకరమని అన్నారు
మరోవైపు సాధారణ వ్యాక్సినేషన్‌లను డిజిటలైజ్ చేయడానికి U-WIN పోర్టల్‌ను పాన్-ఇండియా రోల్‌అవుట్‌ని కూడా ప్రధాని ప్రకటించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..