
PM Internship Scheme 2025 : ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) పైలట్ దశ – 2 కోసం దరఖాస్తులను ప్రారంభించింది. ఈ గడువు వచ్చే వారం ముగిసిపోతుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) అధికారిక పోర్టల్, pminternship.mca.gov.in ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ మార్చి 12, 2025.
PM Internship Scheme 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ పథకం
పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది జూలై 23న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనిని అక్టోబర్ 3, 2024న ప్రారంభించారు. ఇప్పటివరకు, ఈ పథకం 28,141 మంది అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించిందని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ఇటీవల లోక్‌సభకు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లు 12 నెలల పాటు కొనసాగుతాయి, ఈ కార్యక్రమంలో కనీసం సగం ఆచరణాత్మక పని అనుభవంపై దృష్టి సారిస్తాయి.
అర్హత ప్రమాణాలు
- ఈ పథకానికి అర్హత సాధించడానికి, దరఖాస్తుదారులు ఈ క్రింది అవసరాలను తీర్చాలి:
- వయసు : 21 మరియు 24 సంవత్సరాల మధ్య
- ఉద్యోగ స్థితి: పూర్తి సమయం ఉద్యోగంలో ఉండకూడదు.
- విద్యా నేపథ్యం: కనీసం 10వ తరగతి చదివి ఉండాలి. ప్రముఖ సంస్థల నుండి (IITలు, IIMలు వంటివి) గ్రాడ్యుయేట్లు లేదా వృత్తిపరమైన అర్హతలు (CA లేదా CMA వంటివి) ఉన్నవారు మినహాయించబడ్డారు.
- ఈ పథకం పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ITIలు), కౌశల్ కేంద్రాలు (నైపుణ్య కేంద్రాలు)లో శిక్షణ పొందిన యువతకు కూడా అందుబాటులో ఉంది.
- ఆదాయ పరిమితులు: వార్షిక ఆదాయం 8 లక్షలకు మించి ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారుఅర్హులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వ్యక్తులు కూాడా అర్హులు కాదు.
- దరఖాస్తుకు చివరి తేదీ: రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ మార్చి 12, 2025.
పథకం ప్రయోజనాలు
PM ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) అనేది 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రభుత్వ చొరవ. ఇది యువతకు వృత్తిపరమైన పని వాతావరణాల్లో ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తారు. ఈ పథకం కింద ఎంపిక చేయబడిన ఇంటర్న్‌లు భారతదేశంలోని టాప్ 500 కంపెనీలకు పంపించబడతారు. వారి కెరీర్ అవకాశాలను పెంచేందుకు గాను నైపుణ్యాలను పెంచుకోవడమే కాకుండా ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందుతారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పరిశ్రమల వాతాారణాలకు సన్నద్ధం చేయడానికి, వారి ఉపాధి సామర్థ్యాన్ని పెంచడానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం అందించే స్టైఫండ్ ఇంటర్న్‌షిప్ సమయంలో వారి ప్రాథమిక ఖర్చులను తీర్చుతుంది.ఈ అనుభవం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచుతుంది, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. ప్రతి ఇంటర్న్‌కు నెలవారీగా ~5,000 ఆర్థిక సహాయం, ఒకేసారి ~6,000 ఆర్థిక సహాయం అందుతాయి.
ప్రతి ఇంటర్న్‌కు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజ,న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రభుత్వ బీమా పథకాల కింద బీమా కవరేజ్ లభిస్తుంది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అదనంగా, కంపెనీలు ఇంటర్న్‌లకు అదనపు ప్రమాద బీమా కవరేజీని అందించవచ్చు.
PMIS కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి
అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.in. ను సందర్శించండి. హోమ్‌పేజీలో, ‘రిజిస్టర్’ అనే ఆప్షన్ ను చూడటానికి కిందికి స్క్రోల్ చేయండి. లింక్‌ను ఎంచుకోండి, మీకు వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ వివరాలు పూరించి.. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయండి.. చివరగా సబ్మిట్ అనే బటన్‌ను క్లిక్ చేయండి..
రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు రుసుము లేదు. అభ్యర్థి అందించిన వివరాల ఆధారంగా, రెజ్యూమ్ స్వయంచాలకంగా రూపొందించబడుతుంది, ప్రతి విద్యార్థి వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఐదు అవకాశాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.