Wednesday, March 12Thank you for visiting

దేశంలో సొరంగ మార్గాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు.. ఇక మ‌రింత వేగంగా రోడ్డు ప్ర‌యాణాలు

Spread the love

Nitin Gadkari | రోడ్డు ప్ర‌యాణాల‌ను మ‌రింత సౌక‌ర్య‌వంతంగా, సుల‌భ‌త‌రం చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో దేశంలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అనేక ట‌న్నెళ్ల‌ను (Tunnels) నిర్మించబోతోంది. మౌలిక సదుపాయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ () దృష్టి సారించారు. ఇందులోభాగంగా దేశంలో సొరంగాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు కేంద్రం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది.

మీడియాతో గడ్కరీ మాట్లాడుతూ.. చాలా కొత్త సొరంగాలు నిర్మించ‌నున్నామ‌ని తెలిపారు. మంగళవారం పారిశ్రామిక సంస్థ ఫిక్కీ నిర్వహించిన టన్నెలింగ్ ఇండియా సదస్సు రెండో ఎడిషన్‌లో ఆయన పాల్గొన్నారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 74 కొత్త సొరంగాలను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని, వీటి మొత్తం పొడవు 273 కిలోమీటర్లు ఉంటుందని ఆయన చెప్పారు.

భౌగోళిక వైవిధ్యం.. కొత్త సవాళ్లు..

భారతదేశ భౌగోళికం వైవిధ్యంతో నిండి ఉందని, ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించ‌డంలో అనేక క‌ఠిన‌మైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని గడ్కరీ అన్నారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి, వాస్తవానికి ఏ సాంకేతికత మనకు ఉత్తమమైనది, నాణ్యతలో రాజీ పడకుండా ఖర్చును తగ్గించే ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎన్నుకున్న‌ట్లు తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం 69 సొరంగాల (Tunnels) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలో ఇప్పటికే 35 సొరంగాల పనులను ప్రభుత్వం పూర్తి చేసిందని, వాటి పొడవు 49 కిలోమీటర్లు అని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ సొరంగాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 వేల కోట్లు వెచ్చించింది. ఇది కాకుండా మొత్తం 135 కిలోమీటర్ల పొడవుతో దాదాపు రూ.40 వేల కోట్లతో 69 అదనపు సొరంగాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివ‌రించారు. .

పేలవంగా DPR నాణ్యత

నిర్మాణ నాణ్యతపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంద‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. భారత్‌లో డీపీఆర్‌ నాణ్యత చాలా తక్కువగా ఉందని అన్నారు. హైవే, రోడ్డు లేదా టన్నెల్ నిర్మాణంలో డీపీఆర్ కన్సల్టెంట్లు సరైన విధానాలను పాటించడం లేదు. ప్రాజెక్ట్‌ల ఫైనాన్షియల్ ఆడిట్ కంటే పెర్ఫార్మెన్స్ ఆడిట్ ముఖ్యం. భారతదేశంలో, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలలో భూ-నిర్దిష్ట విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ప్రీకాస్ట్ టెక్నాలజీ, పుష్-బ్యాక్ టెక్నిక్ మొదలైన వాటిని అనుసరించాల్సిన అవసరం ఉంది. అని అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version