Saturday, April 19Welcome to Vandebhaarath

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Spread the love

New Vande bharat Trains  | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న దిల్లీ నుంచి ఒకే సారి మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు మీరట్ నుంచి లక్నో, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ అలాగే బెంగుళూరు నుంచి మధురై రూట్లలో నడుస్తాయి.

ఫ్లాగ్ ఆఫ్ చేయబోయే కొత్త రైళ్లు:

  • మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
  • బెంగళూరు-మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్

త్వరలో బికనీర్ నుంచి దిల్లీకి వందే భారత్

నవంబర్‌లో బికనీర్‌ నుంచి ఢిల్లీ మార్గంలో వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఉదయం బికనీర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వీలు క‌లుగుతుంది. అదే రాత్రి తిరిగి రావొచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అక్టోబర్ నాటికి షెడ్యూల్, స్టేషన్ స్టాపేజ్‌లు, సమయాలను ఖరారు చేయడంతో నవంబర్ నుంచి రైళ్లు క్రమం తప్పకుండా నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

New Vande bharat Trains వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో దేశీయంగా తయారయిన సెమీ-హై స్పీడ్ రైలు సెట్. ఈ రైలు అత్యాధునికమైన ఫీచ‌ర్లు క‌లిగి ప్రయానికులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. వందే భారత్ రైలు భారతదేశంలో స్వదేశీంగా తయారు చేయబడిన మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు సెట్, దీనిని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. ఇది గరిష్టంగా 160 km/h వేగంతో దూసుకువెళ్తుంది. GPS-ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థల వంటి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. మెరుగైన భద్రత కోసం ఆన్‌బోర్డ్ Wi-Fi మరియు CCTV కెమెరాలు ఇందులో అమ‌చ్చారు.

ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా వంటి సుదూర మార్గాలలో నడపగలిగే స్లీపర్ క్లాస్ వందే భారత్ ట్రైన్‌సెట్‌లను ప్రవేశపెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం, అన్ని వందే భారత్ రైళ్లలో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ తరగతులు మాత్రమే ఉన్నాయి, ఇవి తక్కువ దూరం గ‌ల మార్గాల్లో సేవ‌లందిస్తున్నాయి.

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version