
New Rule For Pension : కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ విషయమై ప్రభుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు తమ పెన్షన్ పొందేందుకు పెన్షన్ ఫారమ్ 6-Aని పూరించాలి. ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూరించడానికి ఏకైక మార్గం భవిష్య లేదా e-HRMS 2.0 పోర్టల్ ను సందర్శించాల్సి ఉంటుంది.
పెన్షన్ విధానాలపై కొత్త నిబంధన నవంబర్ 6, 2024 నుండి అమలులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తుల హార్డ్ కాపీలు ఇకపై ఆమోదించబడవు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్స్ సంక్షేమ శాఖ తాజా సమాచారంతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పెన్షన్ దరఖాస్తు ఫారమ్‌లు గతంలో కాగితంపై పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రక్రియలను డిజిటలైజ్ చేసే లక్ష్యంతో ఈ నిబంధనను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
నవంబర్ 16 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఇది అందుబాటులో ఉంది. దీని కోసం నవంబర్ 4, 2024న నోటిఫికేషన్ ను కేంద్రం జారీ చేసింది.పెన్షన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా, సులభతరం చేయడానికి ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లను ప్రారంభించంది. ఈ మార్పు లో భాగంగా పింఛను ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ శిక్షణా సమావేశాల్లో కొత్త సిస్టమ్ ను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవాలి అనే విషయాలపై కార్యాలయ అధిపతులు, నోడల్ అధికారులకు ఈ కొత్త నిబంధన ఉద్యోగులందరికీ చేరేలా చూడాలని పెన్షన్ క్లెయిమ్‌ల కోసం ప్రతి ఒక్కరూ కొత్త విధానాన్ని అనుసరించాలని అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు అన్ని విభాగాలకు సూచించబడింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు