Saturday, March 15Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.

National, Special Stories
Vinayaka Chavithi: వరంగల్: వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. ఇప్పటికే అందరూ పూజా సామాగ్రి కొనుగోళ్లలో నిమగ్నమై పోయారు. ఈరోజు చేసే వినాయక పూజలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినాయక వ్రత కథ (Vinayaka Chavithi vratham) గురించి.. ఈ కథను విన్నా.. చదివినా.. నీలాపనిందలకు దూరంగా ఉండొచ్చని సాక్షాత్తూ శ్రీకృష్ణుడు తెలిపాడు. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుని.. నిందలకు దూరంగా ఉందాం.. వినాయకుడి చరిత్ర (Vinayaka Chavithi story) వినాయక చవితి పండుగ (Ganesh chathurthi) రోజు కచ్చితంగా వినాయక వ్రత కథ చదవాల్సిందే.. లేదా వినాల్సిందే అంటున్నారు వేద పండితులు. దీనివల్ల భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. వినాయక వ్రతకథ చదివేవారు.. లేదా పూజల్లో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై వేసుకోవాలి.ఇప్పుడు కథలోకి వెళ్దాం.. పురాణాల ప్రకారం... తన భక్తుడైన ...

మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

National
ఢిల్లీలో అంతర్జాతీయస్థాయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో  సెంటర్ 8 అంతస్తుల్లో కన్వెన్షన్ హాళ్లు, బాల్ రూం, మీటింగ్ హాల్స్ 8.9లక్షల చదరపుమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కేంద్రం 17న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం న్యూఢిల్లీ : అత్యంత ఆకర్షణీయ నిర్మాణాలు, పర్యాటక క్షేత్రాలకు నిలయమైన ఢిల్లీలో మరో అద్భుత నిర్మాణం యశోభూమి (YashoBhoomi) అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరు 17వ తేదీ ఆదివారం నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యశోభూమి పేరుతో నిర్మించిన అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఇది ఫేజ్ 1 ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) 'అని పిలుస్తారు. దేశంలో సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రధానమంత్రి ఆలోచనతో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల ప్రా...

అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. మరోచోట సజీవంగా దొరికాడు.

National
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన లక్నో: హత్యకు గురైన యువకుడి మృతదేహానికి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అతడు మరోచోట సజీవంగా కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ముజఫర్‌నగర్‌ (Muzaffarnagar)  జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఆగస్టు 31న 18 ఏళ్ల వయసున్న మోంటూ, అదే వయసు గల యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. అయితే తమ కుమార్తెను మోంటు కిడ్నాప్ చేసినట్లు ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ జంట ఆచూకీ కనుగొనేందుకు పోలీస్ బృదాలను ఏర్పాటు చేశారు. కాగా, సెప్టెంబర్ 13న మోంటూ కుటుంబ సభ్యులకు మీరట్‌ (Meerut) పోలీసులు ఫోన్ చేశారు. కాలువలో తల లేని యువకుడి మృతదేహం లభ్యమైందని దానిని గుర్తించాలని పిలిపించారు. దీంతో వెంటనే మార్చురీకి తల్లిదండ్రులు వెళ్లారు. మృతదేహంపై టాటూను చూసి ఆ మృతదేహం మోం...

Nipah Virus : కేరళలో 5 నిపా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 700 మంది, 77 మంది హై-రిస్క్

National
కేరళ (kerala) లో నిఫా వైరస్ భయాందోళన సృష్టిస్తోంది. నిపా సోకిన పేషెంట్‌తో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త బుధవారం పాజిటివ్‌ తేలడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్‌ల ( Containment zones )ను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించింది. నిఫా రోగులతో కాంటాక్ట్ అయిన వారి సంఖ్య 700గా ఉండడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ 700 మందిలో 77 మంది హైరిస్క్ కేటగిరీలో ఉన్నారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో Nipah Virus అప్‌డేట్‌లు 1. హై రిస్క్ ఉన్న నిపా రోగులు తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. 2. కోజికోడ్‌లో పండుగలు, ఫంక్షన్లలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఆంక్షలు విధించారు. 3. కోజికోడ్ జిల్లా (Kozhikode district) లోని వడకర తాలూకాలోని తొమ్మిది పంచాయతీల్లోని 58 వార్డులను కంటైన్‌మెంట్ జో...

హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య తర్వాత ఏం జరిగింది..? కాసీం రజ్వీ కథ ఎలా ముగిసింది..?

National
ఆధునిక హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ 1948 ఒక మలుపు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని సంస్థానాలు భారత యూనియన్ లో విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరాకరించాడు. అతడి ప్రైవేట్ సన్యమైన కాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు తెలంగాణ ప్రాంతంలో రెచ్చిపోయారు. వారి ఆగడాలకు హద్దులేకుండా పోయింది. దీంతో అప్పటి భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13న హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య చేపట్టింది. తర్వాత నిజాం రాజ్యం భారతీయ యూనియన్ లోవిలీనమైంది. పదవీచ్యుతుడైన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌పై భారత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు.. కానీ హైదరాబాద్ ప్రధాని లైక్ అలీ, అతని మంత్రివర్గంలోని సభ్యులను గృహనిర్బంధంలో ఉంచారు. రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ, అతని సహచరులపై హత్య, దహనం, దోపిడి వంటి వివిధ కేసులలో అరెస్టు చేశారు. నెహ్రు నేతృత్వంలోని ఇండియన్ యూనియన్ కు హైదరాబాద్ సంస్థానం ప...

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

Crime, National
వరంగల్: అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలతోపాటు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యు లు గల ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2కోట్లు విలువైన 2కిలోల 380 గ్రాముల బంగారం, వజ్రాభరణాలు, రూ.5.20 లక్షల విలువైన 14 గంజాయి ప్యాకెట్లు, పిస్టల్, కారు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్ కార్డులు రూ.5వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అక్బర్ ఖురేషి(ఘజియాబాద్,ఉత్తరప్రదేశ్), కపిల్ జాటోవు (మీరట్), మహ్మద్ షరీఫ్ (ఘజియాబాద్), ఎండి జాద్ ఖాన్(ఘజియాబాద్) ఉన్నారు. అరెస్టు వివరాలను వరం గల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 5న వరంగల్ మట్టెవాడ, హన్మకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అపార్ట్ మెంట్లో తాళం వేసిన ఉన్న 8 ఇళ్లలో పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆ...

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

National
  కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చనిపోవడంతో మనస్తాపం చెందిన అతడి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షీజా బేగంకు భర్త, కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సజిన్ మహమ్మద్ వయనాడ్‌లోని ఒక కళాశాలలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ చదువుతున్నాడు. కాగా గత మంగళవారం మధ్యాహ్నం అతని మోటార్‌సైకిల్‌ను జీపు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మహ్మద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కొడుకు తన కుమారుడి మృతదేహాన్ని స్వీకరించేందుకు షీజా బేగం భర్త, బంధువులు వాయనాడ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కొడుకును తలుచుకుంటూ మనస్తాపానికి గురైన తల్లి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మొత్తం కుటుంబాన్నే ఛిద్రం చేస్తా...

ఇస్రో కౌంట్‌డౌన్‌ల సమయంలో స్వరం వినిపించిన మహిళా శాస్త్రవేత్త ఇకలేరు..

National
గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూత చెన్నై : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్‌ల సమయంలో తన స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి (Valarmathi) ఇకలేరు. శనివారం ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో ఆమె చివరిసారిగా బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు. జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించారు. తమిళనాడులోని అరియలూర్‌కు చెందిన వలర్మతి శనివారం సాయంత్రం గుండెపోటుతో చెన్నైలో మరణించారు. జూలై 14న ప్రయోగించిన అత్యంత విజయవంతమైన చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్‌గా నిలిచింది. . ISRO scientist Valarmathi మృతికి ISRO మాజీ డైరెక్టర్ డాక్టర్ PV వెంకటకృష్ణన్ X (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు. “శ్రీహరికోట నుండి ఇస్రో యొక్క భవిష్యత్తు మిషన్ల కౌంట్‌డౌన్‌లకు వలర్మతి మేడమ్ వ...

నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపిన చిరుత..

National
Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. చిరుతపులి(leopard) నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపేసింది. ఉధంపూర్ జిల్లా (Udhampur District) లో శనివారం రాత్రి 7-8 గంటల మధ్య జరిగిన ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం అందుకున్న ఉధంపూర్ కంట్రోల్ రూమ్‌.. వెంటనే, బాలికను రక్షించడానికి ఒక బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించింది. ఉదంపూర్‌లోని జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణి విభాగం రేంజ్ అధికారి రాకేష్ శర్మ మాట్లాడుతూ.. “రాత్రి 7-8 గంటల మధ్య, 4 ఏళ్ల బాలికను చిరుతపులి ఎత్తుకెళ్లింది. మాకు సమాచారం అందడంతో ఉదంపూర్ కంట్రోల్ రూమ్ నుంచి బృందాలను పంపించాం. "ఇది చాలా దురదృష్టకర సంఘటన, బాలిక కుటుంబానికి మేము అన్ని సహాయం చేస్తాము," అన్నారాయన. జిల్లాలోని పంచారీ తహసీల్‌లోని అప్పర్ బంజలా గ్రామంలోని బాలిక ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో స్థానికులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని శర్మ త...

వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్

National
వరంగల్: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ (warangal cyber police station) ను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరాలు (cyber crime) కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు సంబంధంచిన ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు వరంగల్ సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవసరమైన ప్రదేశాన్ని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ...
Exit mobile version