Saturday, March 15Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Sambhal : సంభాల్‌లో హింసకు ఉపయోగించిన ఇటుకలు, రాళ్లతోనే పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణం

National
Uttar Pradesh Sambhal Violence : సంభాల్ లో హింసాకాండ జ‌రిగిన‌ ప్రాంతంలో శాంతిభద్రతలను ప‌టిష్టం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొత్తం 38 పోలీసు అవుట్‌పోస్టు (Police Outpost)లను నిర్మిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ 24న జరిగిన హింసాత్మక ఘర్షణల సమయంలో అల్లరి మూక‌లు విసిరిన ఇటుకలు, రాళ్లనే ఇప్పుడు ఈ ప్రాంతంలో పోలీసు అవుట్‌పోస్టును నిర్మించడానికి ఉప‌యోగిస్తున్నారు. గత సంవత్సరం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) జామా మసీదు సర్వే సందర్భంగా దుండగులు భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేయడంతో జిల్లాలో తీవ్ర హింస జరిగిన విష‌యం తెలిసిందే.. ఈ అల్లర్లు ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. అయితే పోలీసుల‌పై అల్ల‌రి మూక‌లు విసిరిన‌ రాళ్లను ఇప్పుడు పోలీసు అవుట్‌పోస్ట్ కోసం ఉపయోగిస్తున్నారు.ఇటుకలు, రాళ్లను ఇప్పుడు దీపా సారాయ్, అలాగే హిందూ పురఖేడ పోలీస్ అవుట్‌పోస్టుల నిర్మాణంలో వినియోగి...

Aurangzeb : ఔరంగజేబ్‌ను పొడిగిడినందుకు స‌మాజ్ వాదీ పార్టీ నేత‌పై కేసు

National
అత్యంత క్రూరుడైన‌ మొఘల్ పాలకుడు ఔరంగజేబును (Aurangzeb) ప్రశంసిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అబు అజ్మీ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో, శివసేన (షిండే వర్గం) ఆయనపై పోలీసు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా అజ్మీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శివసేన ఫిర్యాదు శివసేన (షిండే వర్గం) అబూ అజ్మీపై ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మాజీ ఎమ్మెల్యే, శివసేన అధికార ప్రతినిధి కిరణ్ పవాస్కర్, పార్టీ కార్యకర్తలతో కలిసి ఎస్పీ నాయకుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. అలాగే, శివసేన ఎంపీ నరేష్ మష్కే BNS సెక్షన్లు 299, 302, 356 (1), మరియు 356(2) కింద ప్రత్యేక...

UTS Cashback Offer | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ | UTS మొబైల్ యాప్ తో అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్

National
UTS Cashback Offer | రైలు ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారుల అభిప్రాయం ప్రకారం, UTS యాప్ ఆధునిక టికెటింగ్ వ్యవస్థలో ఒక పెద్ద ముందడుగు. భారతీయ రైల్వేస్‌లో అన్‌ రిజర్వ్ టిక్కెట్లపై ప్రయాణించేవారికి ఇది ఒక వరంగా చెప్ప‌వ‌చ్చు. డిజిటల్ ఇండియా చొరవకు అనుగుణంగా, ఈ యాప్ నగదు రహిత లావాదేవీలను ప్రోత్స‌హిస్తుంది. ప్రయాణీకులు R-Wallet, Paytm, PhonePe, Googlepay, UPI యాప్‌లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ డిజిటల్ ప్లాప్‌ఫాంల ద్వారా చెల్లింపు చేయవచ్చు. R-Wallet UTS యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిలో మొత్తాలను రూ. 20,000 పరిమితి వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రచార సూచనగా, R-Wallet ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై 3 శాతం క...

PF UPI Withdrawal Rules : త్వరలో UPI నుంచి EPF డబ్బును విత్ డ్రా చేసుకునే వెలుసుబాటు.. దశల వారీ ప్రక్రియ ఇదే.

National
PF UPI Withdrawal Rules ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో EPF చందాదారులకు UPI ద్వారా PF మొత్తాన్ని ఉపసంహరించుకునే సౌకర్యాన్ని అందించబోతోంది. రాబోయే 2 నుండి 3 నెలల్లో, Paytm, Google Pay, PhonePe మొదలైన యాప్‌ల ద్వారా డబ్బును ఉపసంహరించుకోవచ్చు. PF UPI ఉపసంహరణ నియమాలు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కస్టమర్లకు త్వరలో కొత్త సౌకర్యాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. EPF చందాదారులు ఇప్పుడు త్వరలో UPI ద్వారా తమ డబ్బును ఉపసంహరించుకోగలరు. EPFO ఇప్పుడు Paytm, Google Pay, PhonePe మొదలైన యాప్‌ల ద్వారా ఇంటి నుండే మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా PF మొత్తాన్ని బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం కోట్లాది EPFO ​​కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. PF UPI Withdrawal Rules : మీ పీఎఫ్ డ‌బ్బుల‌ను ఈజీగా ఎలా పొంద‌వ‌వ‌చ్చో తెలుసా? PF UPI Withdrawal Rules : ఎంప్లాయీస్ ప్రావిడెంట్...

Warangal Railway Station | వేగం పుంజుకున్న వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప‌నులు

National
కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ పున‌రాభివృద్ధి ప‌నులు (Warangal Railway Station) శ‌ర‌వేగంగా కొస‌సాగుతున్నాయి. వ‌రంగ‌ల్ రైల్వేస్టేష‌న్ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.25.41 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే (Indina Railways) స్టేష‌న్ ముఖ ద్వారం సుంద‌రీక‌రించ‌డంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్నారు.ఇప్పటికే ఓరుగల్లు రైల్వేస్టేషన్ ముందు భాగాన్ని కాకతీయుల కళావైభవం, వారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చదిద్దారు.. సాయంత్రం వేళ విభిన్న రకాల రంగురంగు లైట్లతో స్టేషన్ వెలిగిపోతూ ప్రయాణికులను, బాటసారులను ఆకర్షిస్తోంది. ఇక రైల్వే స్టేషన్ లోపల ప్రయాణీకులు సులభంగా రాకపోకలు సాగించేందుకు, రద్దీని తగ్గించడానికి 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మిస్తున్నారు. అధునాతన రెస్ట్ రూమ్ లు ర...

Warangal Airport | కేర‌ళ కొచ్చి త‌ర‌హాలో వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం

National
Warangal Airport | వరంగల్ మామునూరు విమానాశ్రయం (Warangal Mamunoor Airport) కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు సూచించారు. వరంగల్ విమానాశ్రయాన్ని అత్యంత‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించాల‌ని ఆయన సూచించారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం (Central Governament) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్ నివాసంలో అధికారుల‌తో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. Warangal Airport : ప్రతీ నెలా నివేదిక అందించాలి.. విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ, పెండింగ్ అంశాల వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి త...

రూ.30,000 తగ్గింపుతో Samsung Galaxy S25 Ultra ఫ్లాగ్‌షిప్ ఫోన్

National
Samsung Galaxy S25 Ultra Price cut | గత నెలలో విడుదలైన తర్వాత తొలిసారిగా శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ప్రారంభంలో రూ.1,29,999 ధ‌ర‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు రూ.99,999కే అందుబాటులో ఉంది. కొత్త ఆఫ‌ర్ ద్వారా కొనుగోలుదారులు రూ.30,000 వరకు అద్భుతమైన ఆదా చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం, ఈ భారీ తగ్గింపు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సేల్ లో అందుబాటులో ఉంది. మీరు ఈ ప్రీమియం ఫోన్ ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ నిర్ణయం తీసుకునే ముందు అందుబాటులో ఉన్న ఆఫర్‌లను తనిఖీ చేయండి. Samsung Galaxy S25 అల్ట్రా డిస్కౌంట్ డిస్కౌంట్ ధరతో పాటు, Samsung Galaxy S25 Ultra కొనుగోలు చేసినప్పుడు రూ. 9,000 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదనంగా, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్ చే...

PM Modi | ‘జంగిల్ రాజ్ నాయకులు హిందూ మతాన్ని అపహాస్యం చేశారు…’:

National
మహా కుంభమేళాపై ఆర్జేడీపై ప్రధాని మోదీ ఫైర్‌ PM Modi in Bihar | ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (MahaKumbh Mela 2025 )పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తీవ్రంగా విమర్శించారు. హిందూ మతాన్ని అపహాస్యం చేసి, అపహాస్యం చేసిన 'జంగల్ రాజ్' నాయకులను బీహార్ ప్రజలు క్షమించరని మోదీ అన్నారు. జంగల్ రాజ్ నాయకులు మహా కుంభమేళాను, హిందూ మతాన్ని అపహాస్యం చేశారు. బీహార్ ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించరు" అని మోదీ భాగల్పూర్‌లో అన్నారు. అయితే, ఆర్జేడీ నేత ఇటీవల మహా కుంభమేళాను 'ఫాల్తు' (అర్థరహితం) అని అన‌డంతో తీవ్ర వివాదం చెల‌రేగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం 19వ విడత నిధులను బదిలీ చేసిన తర్వాత జరిగిన సభలో మోదీ (PM Narendra Modi) ప్రసంగిస్తూ, రైతుల సంక్షేమం, బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించారు....

Mahakumbh 2025 : మహా కుంభమేళాలో రంగంలోకి దిగిన 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు

National
Mahakumbh 2025 : మహాకుంభ్ నగర్‌లో త్రివేణి సంగమం ప్రాంతాల‌ను ప‌రిశుభ్రం చేయ‌డానికి యూపీ ప్ర‌భుత్వం భారీ శానిసేష‌న్ డ్రైవ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు రంగంలోకి దించింది. మ‌హాకుంభ్ న‌గ‌ర్ ను నాలుగు వేర్వేరు జోన్‌లుగా విభజించి ఏకకాలంలో క్లీనింగ్‌ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. Mahakumbh 2025 : గిన్నిస్ బుక్ లో నమోదు సోమవారం (జనవరి 24) మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ ద్వారా మొత్తం 4 జోన్లలో 15,000 మందికి పైగా పారిశుధ్య కార్మికులు ఏకకాలంలో శుభ్రతా డ్రైవ్ నిర్వహిస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒక రికార్డు అని చెప్ప‌వ‌చ్చు. ఇంత భారీ సంఖ్య‌లో పారిశుద్ధ్య కార్మికులు ఒకేసారి ఒక ప్రాంతంలో ప‌నిచేడ‌యం జ‌ర‌గ‌లేదు. ఇది 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో నమోదు చేయ‌నున్న‌ట్లు తెలిసింది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య‌నాథ్‌ ...

Mahakumbh 2025 | 60 కోట్లు దాటిన కుంభ‌మేళా భ‌క్తులు.. ముగింపు ద‌శ‌లోనూ త‌గ్గ‌ని జోరు

National
Mahakumbh 2025 | ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) లో కుంభమేళా త్వరలో ముగియనున్నందున, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. మహా కుంభమేళాలో ఊహించని విధంగా 60 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మహాకుంభమేళా ప్రారంభమైనప్పుడు, ప్రభుత్వం 45 కోట్ల మంది వస్తారని అంచనా వేసింది, కానీ ఆ సంఖ్య ఇప్పటికే 60 కోట్లను దాటింది. Mahakumbh 2025 : 65 కోట్ల మార్కు దాటుతుందా? ఫిబ్రవరి 26న జరిగే చివరి 'అమృత స్నానం' నాటికి భక్తుల సంఖ్య 65 కోట్లను దాటుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలోని 110 కోట్ల మంది హిందువుల‌లో సగానికి పైగా పవిత్ర సంగమంలో స్నానం చేశారని అధికారిక ప్రకటన తెలిపింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 వరకు...
Exit mobile version