
Mumbai to Kazipet Trains | దసరా, దీపావళి, ఛత్ పండు గల సమయంలో ప్రయాణికులకు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా అదనపు ప్రత్యేక రైలు సర్వీస్ లను ప్రవేశపెడుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ పీక్ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించి వారికి సౌకర్యవంతమైన ప్రయాణాలను అందించేందుకు ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది.
సెంట్రల్ రైల్వే.. ముంబై నుంచి కాజీపేటకు 26 అదనపు ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తోంది. రాబోయే పండుగలను జరుపుకోవడానికి ప్రయాణించే ప్రయాణీకులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
రైలు షెడ్యూల్:
07196 / 07195 దాదర్-కాజీపేట వీక్లీ స్పెషల్ (10 సర్వీసులు)
దాదర్ నుంచి కాజిపేట : అక్టోబర్ 17, 2024 నుంచి నవంబర్ 28, 2024 వరకు ప్రతీ గురువారం మధ్యాహ్నం 3:25 గంటలకు, మరుసటి రోజు మధ్యాహ్నం 12:50 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది.
కాజీపేట నుంచి దాదర్ : అక్టోబర్ 16, 2024 నుంచి నవంబర్ 27, 2024 వరకు ప్రతీ బుధవారం సాయంత్రం 5:05 గంటలకు మరుసటి రోజు మధ్యాహ్నం 1:25 గంటలకు దాదర్ చేరుకుంటుంది.
హాల్టింగ్ స్టేషన్లు :
కళ్యాణ్, ఇగత్‌పురి, నాసిక్ రోడ్, మన్మాడ్, నాగర్‌సోల్, రోటగావ్, లాసూర్, ఔరంగాబాద్, జాల్నా, పార్టూర్, సెల్లు, పర్భాని, పూర్ణా, హజూర్ సాహిబ్ నాందేడ్, ముద్ఖేడ్, ఉమ్రి, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, ఆర్మూర్, మెట్‌పల్లి, కోరుట్ల, లిగంపేట జగిత్యాల.
07198 / 07197 దాదర్-కాజీపేట వీక్లీ స్పెషల్ – బల్లార్షా మీదుగా (16 సర్వీసులు)
దాదర్ నుంచి కాజీపేట : అక్టోబర్ 13, 2024 నుంచి డిసెంబర్ 1, 2024 వరకు ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 3:25 గంటలకు, మరుసటి రోజు రాత్రి 9:30 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది.
కాజీపేట నుంచి దాదర్ : అక్టోబర్ 12, 2024 నుంచి నవంబర్ 30, 2024 వరకు ప్రతి శనివారం ఉదయం 11:30 గంటలకు మరుసటి రోజు మధ్యాహ్నం 1:25 గంటలకు దాదర్ చేరుకుంటుంది.
హాల్టింగ్ స్టేషన్లు.. :
కళ్యాణ్, ఇగత్‌పురి, నాసిక్ రోడ్, మన్మాడ్, నాగర్‌సోల్, రోటగావ్, లాసూర్, ఔరంగాబాద్, జల్నా, పర్తూర్, సెల్లు, పర్భాని, పూర్ణా, హజూర్ సాహిబ్ నాందేడ్, ముద్ఖేడ్, భోకర్, హిమాయత్‌నగర్, సహస్రకుండ్, కిన్‌వత్, ఆదిలాబాద్, లంపాల్క్ , వాని, భాండక్, చంద్రాపూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, జమ్మికుంట.
రైలు కోచ్ ల అమరిక:
ప్రత్యేక రైళ్లలో రెండు AC-2 టైర్ కోచ్‌లు, మూడు AC-3 టైర్ కోచ్‌లు, ఎనిమిది స్లీపర్ క్లాస్ కోచ్‌లు, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి, ఇందులో రెండు గార్డ్స్ బ్రేక్ వ్యాన్‌లు ఉంటాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..