Tuesday, April 22Welcome to Vandebhaarath

Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..

Spread the love

Mpox Outbreak | ప్రపంచవ్యాప్తంగా MPOX కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, భార‌త్ అల‌ర్ట్ అయింది. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి స‌మీక్షిస్తోంది. . భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు ఏవీ న‌మోదైన‌ట్లు నివేదించలేదు. అయితే వ్యాధి వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి ముంద‌స్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్ల‌డించింది. ఇదిలావుండ‌గా MPOX వ్యాప్తిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిని అత్యవసరంగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పిలుపునిచ్చింది.

భార‌త్ లో వైర‌స్ వ్యాప్తి త‌క్కువే..

శ‌నివారం జ‌రిగిన‌ సమీక్ష సమావేశంలో, రాబోయే వారాల్లో కేసులు న‌మోద‌య్యే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమ‌ని ప్రస్తుతం భారతదేశంలో మ‌హ‌మ్మారి భారీ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ 2022లో అంతర్జాతీయ ఆందోళన కలిగించే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని మొదటిసారిగా ప్రకటించినప్పటి నుంచి, భారతదేశంలో మొత్తం 30 కేసులను గుర్తించారు. ఈ మార్చిలో చివరి కేసు నమోదైంద‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు ఏవీ నమోదు కాలేదని పేర్కొంది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

వ్యాక్సిన్ తయారీదారులకు WHO విజ్ఞప్తి

Mpox Outbreak : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆగస్టు 14న మంకీపాక్స్‌పై అంతర్జాతీయంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ క్ర‌మంలో శ‌నివారం జ‌రిగిన‌సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పరిస్థితి, సంసిద్ధతను సమగ్రంగా సమీక్షించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ తయారీదారులను వారి ఉత్పత్తిని వేగవంతం చేయాలని, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది, ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలు Mpox వ్యాధి ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నాయి.
అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, గ్రౌండ్ క్రాసింగ్‌లలోని ఆరోగ్య విభాగాలను ప‌టిష్టం చేయ‌డం ద్వారా మంకీ ఫాక్స్ నియంత్రించే చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. పరీక్షా ప్రయోగశాలలను సిద్ధం చేయడం, ఏదైనా కేసును గుర్తించడం, ఐసోలేట్ చేయడం, చికిత్స అందించ‌డం, ఆరోగ్య సదుపాయాలను సిద్ధం చేయడం జరుగుతోంది. 2022 నుండి ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలో మంకీపాక్స్ కారణంగా 99,176 కేసులు, 208 మరణాలను న‌మోదైన‌ట్లు డ‌బ్బ్యూహెచ్ వో వెల్ల‌డించింది.

Mpox ఎలా సంక్రమిస్తుంది.. లక్షణాలు ఏమిటి?

జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, వాపు శోషరస కణుపులు, దద్దుర్లు వంటివి ఎంపాక్స్ కు సంబంధించిన‌ కొన్ని సాధారణ లక్షణాలు ఇవి బహిర్గతం అయిన 1-21 రోజుల తర్వాత చూడవచ్చు. లక్షణాలు రెండు నుంచి మూడు వారాల వరకు ఉండవచ్చు. ఇది పిల్లలకు, బలహీనమైన రోగనిరోధక శ‌క్తి క‌లిగిన వారికి ప్రాణాంతకంగా మారవ‌చ్చు. Mpox సాధారణంగా అంటు చర్మం లేదా నోటిలో లేదా జననేంద్రియాల వంటి ఇతర గాయాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. దుస్తులు వంటి కలుషితమైన వస్తువులను ఉపయోగించడం వల్ల కూడా వ్యాప్తిచెందే అవ‌కాశం ఉంది.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version