Friday, March 14Thank you for visiting

విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

Spread the love

బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపు

వరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని, అటు విద్య ఇటు వైద్యంలో టాప్ లో ఉన్నామన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా వెనుకబడేశారనేది వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా తాను ఈ నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారనే విషయాలపై సోషల్ మీడియా కార్యకర్తలకు ఎమ్మెల్యే వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో ఈ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని, మనం చేసిన పనిని చెప్పుకుంటుూనే, ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను. విమర్శలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. సోషల్ మీడియా వారియర్స్ కు దిశానిర్దేశం చేశారు. కష్టపడితే కచ్చితంగా గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే భరోసానిచ్చారు.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version