Friday, March 14Thank you for visiting

Minor Girls Eggs Selling | సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల అండాల అమ్మకం.. నలుగురు నిందితుల అరెస్ట్‌

Spread the love

లక్నో: సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల నుంచి సేకరించిన అండాలు విక్రయిస్తున్నారు. (Minor Girls Eggs Selling) నిరుపేద కుటుంబాలలోని బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్‌ సెంటర్లకు వచ్చే దంపతులకు మైనర్ బాలికల అండాలు విక్రయిస్తున్నట్లు 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బుతో అమ్మాయిలను ఎరగా వేసి వారి వయసుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది.. మరోవైపు బాలిక అండాల కోసం రూ.30,000 ఇస్తామని చెప్పి 11,500 రూపాయలు మాత్రమే చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొంది.

కాగా, వారణాసి పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. వారణాసి నవపుర ప్రాంతానికి చెందిన సీమా దేవి, ఆమె భర్త ఆశిష్ కుమార్, ఖోంజ్వాన్‌ ప్రాంతానికి చెందిన అనితా దేవి, సోన్ భద్రకు చెందిన అన్మోల్ జైస్వాల్ ను అరెస్టు చేశారు. ఐవీఎఫ్‌ సెంటర్‌ సిబ్బంది, వైద్యులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపైనా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

నిబంధనల ప్రకారం అండం దానం చేసే మహిళ వయసు కనీసం 23 ఏళ్లకు మించి ఉండాలి. ఆమెకు వివాహం కావడంతో పాటు మూడేళ్లకు పైగా వయస్సు ఉన్న బిడ్డ ఉండాలి. అలాగే ఒక మహిళ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే అండ దానం చేసేందుకు అర్హురాలని పోలీసు అధికారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version