Friday, March 14Thank you for visiting

Massive fire | డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 18 బస్సులు దగ్ధం

Spread the love
FacebookXLinkedinWhatsappReddit

 

Massive fire | ఒక బస్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Massive fire) భారీగా అగ్నికీలలుపొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.

బెంగళూరు: బస్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుసుకుంది. (Massive fire) దీంతో భారీగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు కాలి బూడిదయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం వీరభద్ర నగర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్సు డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. డిపోలో నిలిచి ఉన్న బస్సుల్లో సుమారు 18 బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్‌ సిబ్బంది 10 ఫైర్‌ ఇంజిన్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపు చేశారు.
కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గురులింగయ్య వెల్లడించారు. మంటల్లో కాలిన ప్రైవేట్‌ బస్సులకు మరమ్మతుల అక్కడ ఉన్నాయని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మెకానిక్‌లు, వెల్డింగ్‌ చేసే వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు. అయితే వారంతా పరుగులు తీసి అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. పెట్రోల్‌ వంటి మండే వస్తువులు ఆ డిపోలో పలుచోట్ల ఉన్నాయని, అయితే షార్ట్‌ సర్క్యూట్‌ తో మంటలు వ్యాపించి ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version