
TS SSC Results | తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఎస్సెస్సీ ఫలితాలను రిలీజ్ చేశారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్‌లో సున్నా ఉత్తీర్ణత శాతం నమోదు అయింది. గత సంవత్సరం 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ సారి 91.31 శాతానికి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
TS SSC స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు – bse.telangana.gov.in, results.bsetelangana.org
Manabadi TS SSC Results 2024 : పదో తరగతి ఫలితాల్లో . నిర్మల్ జిల్లా అత్యధికంగా 99.09%, సిద్దిపేట 98.65% రాజన్న సిరిసిల్లలో 98.727% ఉత్తీర్ణత సాధించాయి. ఇక అత్యల్పంగా వికారాబాద్ 65.10% శాతం నమోదైంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 మధ్య జరుగుతాయి.
పరీక్ష ఫలితాల్లో ఎవరైనా ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా ఆందోళన చెందవద్దు. విద్యార్థులు ఎవరికైనా మానసిక ఆందోళనకు గురైతే అనుభవిస్తే టోల్-ఫ్రీ నంబర్ 14416కు కాల్ చేయాలని TSBIE కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..