
Madhya Pradesh Loksabha Elections | మధ్యప్రదేశ్‌లోని బేతుల్ (BETUL) జిల్లాలో పోలింగ్ అధికారులతోపాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను తీసుకువెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అనేక EVMలు దెబ్బతిన్నాయని సీనియర్ అధికారి ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనలో పోలింగ్ సిబ్బందికి, బస్సు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. మే 7వ తేదీ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జిల్లాలోని గోలా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగిందని బేతుల్ కలెక్టర్ నరేంద్ర సూర్యవంశీ తెలిపారు.
ఈవీఎంలకు మంటలు
బస్సులోని నిప్పు రవ్వ కారణంగా మంటలు చెలరేగాయ తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదంలో బూత్ నంబర్లు 275, 276, 277, 278, 279, 280 సహా నాలుగు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు (EVM) దెబ్బతిన్నాయని కలెక్టర్ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఆరు పోలింగ్ పార్టీలు, సమాన సంఖ్యలో ఈవీఎంలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఈవీఎంలు చెడిపోగా, రెండు భద్రంగా ఉన్నాయి. మంటలు ప్రభావితమైన ఈవీఎంలలోని కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ దెబ్బతిన్నాయని సూర్యవంశీ తెలిపారు. ఈ ప్రమాదం వల్ల నమోదైన ఓట్ల లెక్కింపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్నకు కలెక్టర్ తన నివేదికను ఎన్నికల కమిషన్ పరిశీలనకు పంపిస్తానని చెప్పారు. ప్రభావిత బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించే విషయమై ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
बैतूल : EVM और मतदान कर्मियों को लेकर लौट रही बस में लगी आग, हादसे में सभी कर्मचारी सुरक्षित. मतदान सामग्री को आंशिक नुकसान होने की खबर#madhyapradesh #betul #LokSabhaElections2024 #EVM pic.twitter.com/6npuPYEvvW
— NDTV India (@ndtvindia) May 7, 2024
మధ్యప్రదేశ్‌లో మూడో దశ పోలింగ్
Madhya Pradesh Loksabha Elections : కాగా, మే 7న జరిగిన మూడో దశ పోలింగ్‌లో బేతుల్ లోక్‌సభ స్థానంలో మొత్తం 72.65 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం ప్రకారం మూడో దశ పోలింగ్‌లో మధ్యప్రదేశ్‌లోని తొమ్మిది లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగగా 66.05 శాతం తాత్కాలిక ఓటింగ్ నమోదైంది. , కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా , ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, బీజేపీ తరఫున శివరాజ్‌సింగ్ చౌహాన్, కాంగ్రెస్ తరఫున దిగ్విజయ్ సింగ్ సహా మొత్తం 127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొరెనా, భింద్ (ఎస్సీ-రిజర్వ్డ్), గ్వాలియర్, గుణ, సాగర్, విదిషా, భోపాల్, రాజ్‌గఢ్, బేతుల్ (ఎస్టీ-రిజర్వ్డ్) ఈ తొమ్మిది స్థానాల్లో పోలింగ్ జరిగింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..